Posts

Showing posts from July, 2026

Z.P.H.S పెంచికల్ దిన్నె

  Z.P.H.S పెంచికల్ దిన్నె , ఈ school చుట్టు పక్కల దాదాపు 20 kms పరిధిలో ఒక్క High School కూడా లేదు. కావున ఈ School కు నేరేడుచర్ల , ఫతేపురం ,Vaikuntapuram,మేడారం , కల్లూరు, దాచారం, సోమవరం గ్రామాలనుండి విద్యార్థులు, 6th class to HSC చదువుకొనుటకు వచ్చేవారు. ఈ school లో చదువుకొనుటకు 10 to 12 km వరకు నడచి వచ్చి చదువుకునేవారు. ఈ school లో చదువుకున్న విధ్యార్థులు ఉన్నత విద్యలు అభ్యసించి govt. ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఈ స్కూల్ పేరు నిలబెట్టారు ప్రభుత్వంలో చేరి వివిధ హోదాలలో సేవలు అందించినారు. ఈ School లో 1968-69 Batch అందరూ తెలంగాణ agitation batch అని పిలుస్తారు ఈ బ్యాచ్ గురించి కొన్ని విశేశాలు తెలుసుకొందాము. 1970 year తర్వాత HSC అనే Course ఆపేశారు. 1969 year బ్యాచ్ 1st Batch of S.S.C. & last Batch of H.S.C. 1969 year ఈ బ్యాచ్ వాళ్లు H.S.C&S.S.C వాళ్లు తెలంగాణ ఉద్యమం వలన 6 నెలల విద్యాసంవత్సరము కోల్పోయిగారు. 1968-69 Batch విద్యార్థులు పలు ఉద్యమాలను Success చేసినారు. Penchikaldinne నుండి Nereducherla వరకు నడుచుకుంటూ వెళ్ళి ఉద్యమం చేసినారు . అందులో మొదటిది - "వ...

కృష్ణలీలలు

6. మృద్భక్షణము - విశ్వరూప దర్శనము 7. కాళియ మర్దనము 8. పూజాఫలము. . 9. గోపికా వస్త్రాపహరణం 10. భగవత్కృప . 11. గోపికాగీతం . 12. కృష్ణస్తు భగవాన్ స్వయం

ఈ లోకమనే యంత్రం భగవంతుని మీద ఆధారపడి ఉంది, ఆయన శక్తి ద్వారా పనిచేస్తున్నది

ఈ లోకమనే యంత్రం భగవంతుని మీద ఆధారపడి ఉంది, ఆయన శక్తి ద్వారా పనిచేస్తున్నది   భగవచ్చింతన ఎన్నడూ మానవద్దు. నీకు ఆనందం కలిగినా, కలుగకపోయినా క్రమవిధానంలో నిత్యం ధ్యానం చేస్తూనే ఉండు. వదలకుండా, స్థిరంగా అభ్యాసం చెయ్యగలిగితే. మళ్ళీ నీవు ఆనందాన్ని అనుభవిస్తావు. వ్యాసమహర్షి ఇలా చెప్పారు: పైత్యరసంప్రకోపిస్తే చక్కెర రుచించదు. కానీ, శ్రద్ధగా ప్రతిరోజూ చక్కెర తింటూ ఉంటే, పైత్యప్రకోపం నయమై పంచదార రుచిని నెమ్మదినెమ్మదిగా ఆస్వాదించడం. మొదలుపెడతావు," ఇదే విధంగా 'అవిద్య' లేక అజ్ఞానం వల్ల పారమార్ధిక సాధనలు రుచించవు. కానీ జపధ్యానాలు వదలకుండా నిత్యం ప్రేమ, ఉత్సాహాలతో చేస్తూ ఉంటే అజ్ఞానం వల్ల కలిగిన విషాదం నశించి, భగవత్ప్రేమ (భక్తి) జనిస్తుంది. కాబట్టి ఎన్నడూ ఆధ్యాత్మిక సాధనలు వదలవద్దు. మరింత హృదయపూర్వకంగా వాటిని కొనసాగిస్తూ ఉండు. చివరకు వాటి నుండి ఆనందాన్ని పొందుతావు. కర్మఫలాల గురించి ఎందుకంత శ్రద్ధ చూపిస్తావు? నీ పనులను చేస్తూ ఉండు. ఈ లోకంలో యజమాని తన ఉద్యోగస్తులకు జీతం ఇస్తూనే ఉంటాడు. తన కోసం పనిచేస్తున్న నీకు భగవంతుడు ఏమీ ఇవ్వకుండా ఉంటాడా? నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు. "నేనేమీ సాధి...

భాధ్యతగా నేను! #Kallem Naveen reddy

  భాధ్యతగా నేను! #Kallem Naveen reddy  భాధ్యతగా నేను! ఓర్వలేని తనాలకు బెదిరింపులకు భయపడే వాడిని కాను నా జీవితమే నిత్యం ఒక పోరాటం అతనికై నా ప్రయాణం కొనసాగుతున్నప్పుడు నన్ను ఎంతమంది ఎత్తిపొడిచిన నాతో పాటుగా మీ రోమాలు నిక్కబొడుచుకునేలా పనిచేస్తా నా అడుగులు అతనితో రేపటి భవిష్యత్ తరాల కోసం! నా ఆలోచనలతో ప్రాంగణమంతా అందంగా అలుకుతూనే ఉంటాను ఉత్సాహమై అక్షరాలతో నిత్యం అనేక తోరణాలను కడుతూ భావాలను ప్రతి హృదయంలో పూయిస్తాను! నేను అజ్ఞానంకే శత్రువునీ కావచ్చుగాక కానీ విజ్ఞానానికి మాత్రం కాదు! - Kallem Naveen Reddy

నడకెంత సుందరమో# కోట్ల వెంకటేశ్వర రెడ్డి

నడకెంత సుందరమో  అతను  రాత్రంతా వెలుతురు కలలు కన్నాడు. వేకువననే సూర్యుడొచ్చి తలుపు తట్టాడు లే... నాలుగడుగులేద్దాం.. రా అన్నాడు ముసుగుతన్ని పడుకుంటూ రేపొస్తాలే నిద్దొస్తుంది అన్నాడు ముద్దగా!   నీకు ఎన్నో ఆప్షన్స్ నాకు లేవంటూ దినకరుడు నిరాశగా వెళ్ళిపోయాడు! వాయిదాలకు అంతెక్కడిది రోజులు వారాలు నెలలు గడచిపోయాయి పాదాలు సుఖాలకు మరిగి బిర్రుగా బిగుసుకపోయాయి నడవాల్సిన రోజొకటొస్తది కదా అప్పుడు తప్పక దారులన్నీ ఎదురు తిరుగుతాయి! నడక ఎంత సుందరమైనదో నడవలేని తనానికి తెలుసు! రేపు ఒకసారి అడుగు బయటేసి చూడు కొత్త అనుభవాలు స్వాగతం పలుకుతాయి!! - కోట్ల వెంకటేశ్వర రెడ్డి 9440233261.

విరుగుతున్న కల#కోట్ల వెంకటేశ్వర రెడ్డి

  నమస్తే తెలంగాణ విరుగుతున్న కల! ఆకుపచ్చని కల ఇక్కడ అన్వయమెరుగని పద్యమైంది. కత్తి దూస్తున్న కరువు చిత్రం ఫీనిక్స్ పక్షిలా పైకి లేస్తున్నది! నేల నేలంతా నెర్రలు వారిన నైరూప్య చిత్రమైంది. తేమ లేని గాలి వదలుతున్నది అగ్ని శ్వాస! జీవనదుల జాలి చూపు ఎదలో భయం విత్తులు నాటుతున్నది. తరుముకొస్తున్న ఆకలి దృశ్యాలు యుద్ధాల కంటే భయంకరమైనవి! నగరాల నాలుక పిడుచ కట్టుకపోతే కాలాన్ని నిందించడం తప్ప కమ్ముకొచ్చే కటిక చీకట్లను కాదనలేం! వట్టి మాటలతో కాలం కండ్లు కప్పుతున్న ఏలికలకు ఎచ్చులకేం తక్కువ లేదు అన్నింటికీ గతం మీదే నింద! దశాబ్ద కాలంగా మూడు కాలాలు తడి నేల మీద తిరుగాడిన పాదాలు ఆగ్రహిస్తే అనల జ్వాలలే!! కోట్ల వెంకటేశ్వర రెడ్డి 94402 33261

నీరు అంటే కేవలం ఒక చుక్క కాదు- Kallem Naveen Reddy

  నీరు అంటే కేవలం ఒక చుక్క కాదు ఒక రైతు ప్రాణం, ఒక పల్లె ఊపిరి, ఒక రాష్ట్ర భవిష్యత్తు! కేసీఆర్ గారి పాలనలో మండుటెండల్లో కూడా చెరువులు నిండుగా ఉండేవి ఆ నీటిలో రైతు నమ్మకం కనిపించేది తెలంగాణ ఆత్మగౌరవం ప్రతిబింబించేది! ఈరోజు మాత్రం సాగునీటి కోసం రైతు ఎదురు చూస్తున్నాడు త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు! నీటి విలువ తెలియని నాయకత్వం చేతుల్లో తెలంగాణ పడి అరిగోసలు పడుతుంది చెరువులు మాత్రమే కాదు ప్రజల ఆశలు కూడా ఎండిపోయాయి చెరువులు నింపడం అంటే కేవలం నీళ్లు పోయడం కాదు ప్రజల జీవితాలను నిలబెట్టడం! నీటిని కాపాడిన పాలన గొప్పతనం అధికార కుర్చీలో కూర్చున్న ప్రతి ఒక్కరికీ అర్థం కాదు అందుకు ప్రజల దాహం తెలుసుకోవాలి రైతు కన్నీటి బరువు తెలుసుకోవాలి ఈ తెలంగాణ నేల గుండె చప్పుడు వినాలి! అందుకే మీ విలువ మీ పాలన విలువ మీరు నిర్మించిన నీటి సంస్కృతి విలువ తెలంగాణ ప్రజలకు తెలుసు తెలియనిది మాత్రం నీటి చరిత్రను చదవని తెలంగాణ ఆత్మను అర్థం చేసుకోని నేటి పాలకులకే! - Kallem Naveen Reddy

పర్వతాలంత సమస్యలు ఎదురైనా ధైర్యం కొండంత ఉంటే ఏ శిఖరమైనా చేరుకోవచ్చు- Kallem Naveen Reddy

Image
  పర్వతాలంత సమస్యలు ఎదురైనా ధైర్యం కొండంత ఉంటే ఏ శిఖరమైనా చేరుకోవచ్చు కాలం ఎంత కఠినంగా పరీక్షించినా సంకల్పం సజీవంగా ఉంటే ఆ సంకల్పమే దారి చూపుతుంది! అలాంటి అచంచల ధైర్యాన్ని అలాంటి చెక్కుచెదరని సంకల్పాన్ని అలాంటి ఆత్మగౌరవాన్ని లక్షలాది తెలంగాణ హృదయాల్లో నింపిన అసాధారణ వ్యక్తిత్వం కేసీఆర్! ఆయన పోరాటం ఒక ఉద్యమ స్పూర్తి కష్టాలకు తలవంచకూడదని నేర్పిన జీవన తత్వం ఆయన ధైర్యం ఒక మాట మాత్రమే కాదు తడబడిన ప్రతిసారి నన్ను నేను నిలబెట్టుకునే బలం! అందుకే నా జీవితంలో ఎన్ని ఆలోచనలు వచ్చినా ఎన్ని సంఘర్షణలు ఎదురైనా ఒక్క క్షణం ఆగి ఆయన పోరాటాన్ని గుర్తు చేసుకుంటే చాలు గుండెల్లో మళ్లీ ధైర్యం పుడుతుంది అడుగుల్లో మళ్లీ నమ్మకం పుడుతుంది ప్రయాణం మళ్లీ మొదలవుతుంది! జై తెలంగాణ! జై కేసీఆర్! - Kallem Naveen Reddy

తెలంగాణకు ఇప్పుడు అవసరమైంది. విభేదాల రాజకీయాలు కాదు- Kallem Naveen Reddy

  తెలంగాణకు ఇప్పుడు అవసరమైంది. విభేదాల రాజకీయాలు కాదు వికాసానికి దారి చూపే ఆలోచనలు! వ్యక్తులపై యుద్ధం కాదు సమస్యలపై పోరాటం ద్వేష ప్రచారం కా దు వ్యవస్థపై బాధ్యత! మీ పైత్యాన్ని ఇతరులపై రుద్దకండి మీ కక్షలను సమాజంపై మోపకండి ఇప్పటికే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న తెలంగాణకు మరిన్ని గాయాలను సృష్టించే ప్రయత్నం చేయకండి! ఒక ప్రాంతాన్ని నాశనం చేసేది శత్రువులు కాదు ఎందుకంటే ఆ బయటి శత్రువులు ఎదురుగా వస్తారు వారితో పోరాడటం సులభం. కానీ కొన్ని అంశాలు చూడలేని మనస్తత్వాలతో కష్టం! తెలంగాణ కోసం కష్టపడే ప్రతి గొంతు విలువైనదే ప్రజల కోసం నడిచే ప్రతి అడుగు అవసరమైనదే అలాంటి వారిని నిరుత్సాహపరచడం అంటే వ్యక్తిని కాదు. ఒక ఆశయాన్ని బలహీనపరచడమే! తెలంగాణను నిర్మించింది కుట్రలు కాదు ఎన్నో త్యాగాలు, ఎన్నో సంఘర్షణలు, ఎన్నో ఆలోచనలు! ఎవరైనా మీ ప్రాంతానికి చెందిన వాళ్ళు చురుకుగా పనిచేస్తుంటే వారిని అడ్డుకోవడం కాదు భాధ్యత కలిగిన వాళ్ళుగా ప్రోత్సహించాలి. సహకరించడానికి ప్రయత్నించండి వ్యవస్థ బలోపేతానికి కృషి చేసిన వాళ్లవుతారు! - Kallem Naveen Reddy

కొంతమంది రాజకీయాన్ని కలయికలతో కొలుస్తారు Kallem Naveen Reddy

  కొంతమంది రాజకీయాన్ని కలయికలతో కొలుస్తారు నేను మాత్రం బాధ్యతలతో కొలుస్తాను నిబద్ధతతో కొలుస్తాను తరచూ నాయకుడిని కలవకపోయినా ప్రతి రోజు సిద్దాంతం కోసం పనిచేస్తే అదే నిజమైన పరిచయం అని నమ్ముతాను! నాయకుడిని కలవడమే నా లక్ష్యం కాదు ఆయన నమ్మిన సిద్ధాంతానికి నిజాయితీగా నిలబడటమే నా లక్ష్యం! ఒక అర్థవంతమైన కలయిక వంద అనవసరమైన కలయికల కంటే గొప్పది భాధ్యత కలిగిన పరిచయాలు కొన్నైనా నిబద్ధత కలిగినవే ఉండాలి నిజాయితీతో కలిగినవే ఉండాలి అవి వెయ్యి పరిచయాల కంటే గొప్పవి! - Kallem Naveen Reddy