నడకెంత సుందరమో# కోట్ల వెంకటేశ్వర రెడ్డి
నడకెంత సుందరమో
అతను రాత్రంతా వెలుతురు కలలు కన్నాడు.
వేకువననే
సూర్యుడొచ్చి తలుపు తట్టాడు
లే... నాలుగడుగులేద్దాం.. రా అన్నాడు
ముసుగుతన్ని పడుకుంటూ
రేపొస్తాలే నిద్దొస్తుంది అన్నాడు ముద్దగా!
నీకు ఎన్నో ఆప్షన్స్ నాకు లేవంటూ
దినకరుడు నిరాశగా వెళ్ళిపోయాడు!
వాయిదాలకు అంతెక్కడిది
రోజులు వారాలు నెలలు గడచిపోయాయి
పాదాలు సుఖాలకు మరిగి
బిర్రుగా బిగుసుకపోయాయి
నడవాల్సిన రోజొకటొస్తది కదా
అప్పుడు తప్పక
దారులన్నీ ఎదురు తిరుగుతాయి!
నడక ఎంత సుందరమైనదో
నడవలేని తనానికి తెలుసు!
రేపు ఒకసారి అడుగు బయటేసి చూడు
కొత్త అనుభవాలు స్వాగతం
పలుకుతాయి!!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి
9440233261.
Comments
Post a Comment