Posts

Showing posts from May, 2026

కెసిఆర్ గారు కొందరిని పార్టీ నుంచి ఎందుకు పక్కన పెట్టాడో ఎందుకు పెడతాడో #Kallem Naveen Reddy

    కెసిఆర్ గారు కొందరిని  పార్టీ నుంచి ఎందుకు పక్కన పెట్టాడో ఎందుకు పెడతాడో  నిన్న చాలామందికి అర్థం అయ్యింది  కాలం గడిచేకొద్దీ ఆ నిర్ణయాల వెనక ఉన్న అనుభవం తెలుస్తుంది! అందుకే కెసిఆర్ చాలాసార్లు వాదనలకు దిగడు ఒక్క మాట కూడా మాట్లాడడు ఎందుకంటే తన సమాధానంకంటే వాళ్ల ప్రవర్తననే  పెద్ద సాక్ష్యం అవుతుందని ఆయనకు తెలుసు ఇది వరకు ఎన్నో సందర్భాల్లో చూశాం! ఎందుకంటే వ్యక్తిత్వం దాచుకోవచ్చు కానీ పరిస్థితులు మారినప్పుడు మనిషి అసలు స్వభావం అనేది  బయటపడకుండా ఎవరు ఆపలేరు! ఆయన ప్రయాణం  ఇష్యూ బేసుడ్ గానే ఉంటుంది తెలంగాణ కోసం శ్వాసించిన వ్యక్తి తెలంగాణ కోసమే తపిస్తున్న మహోన్నతుడు! ఇది కొందరికి అర్దం అయితే బాగుండు అర్ధం కాకనే చిల్లర రాజకీయాలు చేస్తున్నారు చిల్లర ప్రయాణాలు చేస్తున్నారు! - Kallem Naveen Reddy

మనిషి జీవితం: Life అంతే కదా

  మనిషి జీవితం: Life అంతే కదా…. డబ్బులున్నోడు గొప్పోడురా ... నేడు లేనోడు పేదోడురా... నీ ముందు నీ మాటరా మనిషి... నా ముందు నా మాటరా... ఆస్తులంటడు పాస్తులంటడు... మట్టిలో కలిసే మనిషికి... గా మట్టిలో కలిసే మనిషికి... భూములంటడూ జాగలంటడు... భూడిద పాలయ్యే దేహానికి... కాలి బూడిద పాలయ్యే దేహానికి... సచ్చిన నాడు నీ ఒంటిమీద... కట్టుబట్ట కూడ మిగలదురా... బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది?...

అమ్మ: ~ తుమ్మ జనార్దన్ (జ్ఞాన్)

అమ్మ: ~ తుమ్మ జనార్దన్ (జ్ఞాన్) కోరికలను సమాధిచేసి మాతృత్వపు తెరవేసి గంభీర గగనకుసుమం కారుణ్య మూర్తి తనకై ఏమీ కోరని త్యాగశీలి అనురాగవల్లి అమ్మ, ఎంత పిలిచినా తరగని ఆప్యాయత అనుక్షణం ప్రేమ వెదజల్లే మాతృ పరిమళం అనురాగం, ఆప్యాయతలే ఆభరణాలు అమ్మకు. అజరామర అద్భుత జ్ఞాపకాల గని అలుపెరుగక సాగే ప్రేమ జీవనది స్వార్థమెరుగని శాశ్వత స్వాగతాంజలి సాత్త్వికతకు సామరస్య స్నేహితురాలు కర్మఫల మాశించని పరమ యోగిని అమ్మ, జీవన పర్యంతం లభించే ప్రేమామృతం. అమ్మ, బాధ్యతల మేరువులు ప్రేమ మెరుపుల మధ్య తిరగలిలో ధాన్యంలా మారినా ధన్యమైనట్లు భావిస్తుంది బేలగా ఆరోగ్యం అడుగంటినా, ఏమీ ఎరగనట్టుంటుంది లీలగా ప్రేమకు శాశ్వత చిరునామాగా విశ్వంలో నిలిచింది అమ్మ అలసినా, ఆకలేసినా పనిలో నిమగ్నం - జీవన పర్యంతం ఉత్సాహం తగ్గదు, నిట్టూర్పు రాల్చదు - నిజ దేవత కదా అమ్మ! 💐 అమ్మకు పాదాభివందనాలు 🙏

ఎక్కడ మనస్సు

ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మానవులు తలలెత్తుకొని తిరుగగలరో ఎక్కడ జ్ఞానము స్వేచ్ఛగా మనగలుగుతుందో ఎక్కడ సంకుచిత సంసారపు కర్కశ కుడ్యాల మధ్య ప్రపంచం ముక్కలై విడిపోలేదో ఎక్కడ సత్య గహ్వరము నుండి పలుకులు పెల్లుబుకుతాయో ఎక్కడ అలుపు నెరుగని శ్రమ పరిపూర్ణత వైపు చేతులు చాస్తుందో ఎక్కడ మృత ఆచారపు టెడారిలో నిర్మలమైన జ్ఞాన ప్రవాహము ఇంకిపోదో ఎక్కడ మనసు సదా విశాల భావాలలోకి, వినూత్న కార్యాలలోకి నీచే నడుపబడుతుందో ఆ ముక్తిధామానికి, నా తండ్రీ, నా దేశాన్ని మేలుకొలుపు.

MESSAGE

MESSAGE Where the mind is without fear and the head is held high; Where knowledge is free; Where the World has not been broken up into fragments by narrow domestic walls; Where words come out from the depth of truth. Where tireless striving stretches its arms towards perfection; Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit. Where the mind is led forward by thee into ever-widening thought and action- Into that heaven of freedom, my Father, let my country awake. *India is celebrating the Golden Jubilee of its Independence this Year. It is a happy coincidence that this year happens to be the fiftieth birthday of Swami Sundara Chaitanyanandaji also. On this auspicious occasion. we can recall India's immortal message, which has come down to us from time immemorial, through the corridor of time, down scores of centuries. loud and clear, for all humanity, not confined to any particular clime or any specific time. That message of Sanatanad...

quotes of swamiji

02.నిజభక్తుడు చాతకపక్షి లాంటివాడు. గొంతు ఎండుతున్నా కోటినదులు చుట్టూ ఉండినా చాతకము స్వాతి చినుకు కొరకే నిరీక్షిస్తుంది. భోగభాగ్యాలు తనచుట్టూ ఉండినా నిత్యభక్తుడు భగవానుని ఆశిస్తాడే గాని భోగాలలో రమించడు. రామకృష్ణ పరమహంస. భగవంతుని దర్శించేందుకే బ్రతుకు వచ్చింది. కొందరికి బ్రతుకు భలేగా నడుస్తుంది. మరికొందరికి బరువుగా మిగుల్తుంది. కొందరి బ్రతుకులు భోగాలలో రమిస్తూ ఉంటాయి. మరి కొందరి బ్రతుకులు బాధల్లో చరిస్తూ ఉంటాయి. భోగానుభవములో పడినవారు భగవంతుని విస్మరిస్తారు. బాధానుభవములో అలమటించేవారు పరమాత్మను స్మరిస్తారు. భగవానుని మరిపించే భోగాలకన్నా భగవానుని స్మృతికి తెచ్చే బాధలే శ్రేయస్కరం. స్వామి సుందర చైతన్యానంద 03.మనకున్న దానిని విశ్వాసంతో ఉపయోగించడమే నూతన జ్ఞానార్జనకి మార్గము. అమావాస్యరాత్రి చీకటిలో ఒంటరిగ నీవు ఇరవై మైళ్ళు పోవాలి. నీ చేత ఉండే దీపం నిన్ను పది అడుగుల వరకే తీసుకొని పోతుంది. తక్కిన మార్గమంతా చీకటిగా ఉంటుంది. అలాగని నీవు నిరాశ చెంద నవసరం లేదు. వెలుగు ప్రసరించినంత వరకు నడచిపోతే మరో పది అడుగులు వాటంతట అవే తేజోవంత మవుతాయి. పోయే కొలది నీకు చీకటే ఉండదు. చేసిన విషయంలో అసంతృప్తి వద్దు. చేయబో...

ఉత్తిష్ఠ!#కోట్ల వెంకటేశ్వరరెడ్డి 9440233261

నమస్తే తెలంగాణ ఉత్తిష్ఠ! కోట్ల వెంకటేశ్వరరెడ్డి 9440233261 మన నేల మీద మళ్ళీ పల్లేరు మొలకల జాడలు నిశ్శబ్దంగా పరచుకుంటున్న కరువు నీడలు మరోసారి పట్నం వైపు పల్లెల వలస చూపులు ఆకుపచ్చ తెలంగాణ దృశ్యం కనుమరుగయ్యే కుట్ర సాధించుకున్న స్వేచ్ఛ వెనక పరాయి జెండా రెపరెపలు భ్రమలు ఒక్కొక్కటిగా మంచు తెరలై కనుమరుగవుతున్న విషాదకాలం శకుని మాయాజూదం చివరి అంకానికి చేరుకున్న వికృత వేళ జట్లు జట్లుగా దుష్టచతుష్టయం ఏకమై కొత్త కొత్త కుట్రలకు ఆజ్యం పోస్తున్నారు. నీటి దొంగలకు ఇంటి దొంగల తోడు. మాన్పుకున్న గాయాలను గెలికి చూస్తున్నారు యుద్ధం తప్పనప్పుడు సాధకుడు పాంచజన్యం పూరించాల్సిందే! మౌనం ఎంత శక్తివంతమో చరిత్రలో ఒక పాఠమై నిలిచిపోవాలి!

ద్రోహపు డిక్లరేషన్

  నమస్తే తెలంగాణ   ద్రోహపు డిక్లరేషన్ తొలి వేకువ తలుపులు తెరుచుకోకముందే వేప పూతలా రాలిపోతున్నారు భూమిలో చినుకులా ఇంకిపోయి విత్తనమై సాళ్లువారుతున్నారు లౌక్యం తెలియక  రాజకీయ మోసాల జిహ్వలకు బలైపోతున్నారు అంగరంగ వైభవంగా పెళ్లి కొడుకు బరాత్ లా  రైతు డిక్లరేషన్లు ప్రకటిస్తారు ధరలు ముడుచుకొన్నాక ధాన్యానికి దిక్కులేని దారిద్ర్యాలు పాలకుల విధానాలకు ప్రమోషన్లు రాళ్లుగా పుట్టుంటే దేవుడుగా పూజింపబడుదురేమో నాగళ్లుగా పుట్టి నిషాన్ లేక పుచ్చిపోతున్నారు అలలకు  సముద్రం చేతులెత్తేసే దౌర్భాగ్యపు చరిత్ర అన్ని రుతువులకు మోసపోతున్నారు. అన్ని పంటలకు వంచించబడుతున్నారు. దేశంకోసం నిలబడి దేహాన్ని విడిచి తప్పుకుంటున్నారు. మైకుల ముందు కన్నీళ్లను కార్చటమే గానీ సమగ్ర శాశ్వతాలకు ప్రాతిపదికేది? దేవాలయాలలోని దైవాలు కాదు నల్లరేగడి భూములలో నడిపించే దేవుళ్లు చెరువులో చంద్రుడి ప్రతిబింబంలా కర్షకుడు అన్ని దానాల్లో  అన్నదానం మిన్నన్నారు అన్నాన్ని సృష్టించిన అన్నదాతలు అన్యాయంగా ఒరిగిపోతున్నారు శ్రమ స్వేదం మట్టిలో కలిసిపోతున్నది అనంత సంగ్రామం చేసి వెన్నెలను తెచ్చుకోవటం చీకట్లో మగ్గిపోవటానికేనా? అసమ...