101 to 150
108. ఊహలన్నీ వాస్తవాలు కావు. అందుకే, ఎంత గొప్ప ఊహలైనా పువ్వు ల్లాగా కాలంలో వాడిపోతాయి. స్థిరంగా నిలబడటానికి ఊహలకు కాళ్ళులేవు. కానీ వాస్తవాలకు కాళ్ళే కాదు; రెక్కలు కూడా ఉన్నాయి. కనుక అవి నిలబడటమే కాదు; అవసరమైతే అంబరంలో విహరిస్తాయి కూడా. 109. తన ఆనందానికి తానే కారణమైన వాడుజ్ఞాని. కనుక జ్ఞానిఉన్నాడు అంటేనే ఆనందంగా ఉన్నాడు అనిఅర్థము. అనంతంగా ఉన్నాడు అని భావము. 110. ఎవరి కొరకు ఎవరూ లేరనే సత్యం ఏదోఒక రోజు వంటపట్టవలసిందే. ఆ రోజేదో ఈరోజే అయితే, ఈ క్షణం నుండే స్వేచ్ఛా గాలులు పీల్చుకోవచ్చు. 111. ఏ ఒక్కరూ మరొకరిని సుఖపెట్టలేరు. ఏవస్తువూ సదాసుఖాన్ని పంచలేదు. ఏ పరిస్థితి సర్వత్ర మనల్నిఆనందంగా ఉంచలేదు. ఇదేజీవితం మనకు నేర్పిన పాఠం. 112. సుఖ పడటానికి కోరికలు తీరనవసరం లేదు అనేదిఅర్థమైతే, ఆతరువాత కోరికలు ఉన్నా కష్టంఉండదు. కోరికలు తీరకపోయినా నష్టంవాటిల్లదు. 113. నీవు ఉంటేనే మనస్సుఉంటుంది. మనస్సు లేకపోయినా నీవుఉంటావు. నీవుగాని మనస్సు నిన్నెలా బాధ పెడుతుంది? 'మనస్సునేను' అనిభావించడంచేత ఏర్పడిన దుఃఖము 'నేను మనస్సును కాను' అనేసత్యాన్ని గ్రహించడం వల్లనేపోతుంది. 114. బాధించేది మనస్సయితే, బాధపడ...