Posts

శ్రీ కృష్ణాష్టకమ్ - భావార్థ

  వసుదేవుని కుమారుడు, దేవదేవుడు, కంసచాణూరులను వధించినవాడు, దేవకీదేవికి పరమానందమును గూర్చిన వాడును అగు జగద్గురువైన శ్రీ కృష్ణ పరమాత్మకు నమస్క రించుచున్నాను. అవిసిపువ్వువంటి ఆకారము కలిగినవాడును, కంఠ హారముల తోను , అందెలతోను, హస్తాభరణములలోతోను శోభించే ఆకారము గల జగద్గురువగు శ్రీ కృష్ణపరమాత్మకు నమస్కారము. వంపులు తిరిగిన ముంగురులతోను, రత్న కుండలముల తోను, పూర్ణచంద్రునివంటి మోముతో ముద్దులొలికెడి జగద్గురువైన శ్రీ కృష్ణ పరమాత్మకు నమస్కృతులు. మందారపుష్ప పరిమళముతో నిండినదియు, చతుర్భుజములు కలిగినదియు, నెమలిపింఛముతో విలసిల్లు దివ్యదేహము గల జగద్గురువగు శ్రీకృష్ణ పరమాత్మకు వందనములు. పద్మపు రేకులవంటి విశాలనేత్రములతోను, నల్లని మేఘమువంటి శరీరకాంతితోను కూడినవాడై, యాదవు లందరికి శిరోభూషణమువలె ప్రకాశించు శ్రీ కృష్ణ పరమాత్మకు  నమోవాక్కములు. పీతాంబరధారియు, తులసిమాలను ధరించి దాని పరిమళముతో, నిండిన దేహమును కలిగి, రుక్మిణీ దేవితో క్రీడ సలుపు జగద్గురువగు శ్రీ కృష్ణ పరమాత్మకు వందనములు, గోపికలను ఆలింగనము చేసికొను సమయంలో వారి స్తనద్వయమునందున్న కుంకుమతో చిహ్నితమైన విశాల వక్షస్థలం కలవాడును, సంపదలకు నిలయమైనవాడున...

ప్రకృతి అనంత శక్తి ~ తుమ్మ జనార్దన్...జ్ఞాన్...

ప్రకృతి అనంత శక్తి ~ తుమ్మ జనార్దన్ [జ్ఞాన్] ప్రకృతి కరుణిస్తే చల్లని గాలి, నల్లని మేఘం పచ్చదనం, ప్రశాంతత, ఆహ్లాదం, అన్నం, ఆనందం ప్రకోపిస్తే కరాళ నృత్యం, జనం, జీవనం అస్తవ్యస్తం మరణ మృదంగం, మానవ మనుగడ అసాధ్యం, మృగ్యం ప్రకృతి శక్తి స్వరూపిణి, అదుపు చేయలేని అనంత శక్తి కొండలు కదిలించగలదు, మానవ నిర్మితాలు తుడిచిపెట్టగలదు ఊర్లను ఊడ్చేయగలదు, ఆనవాళ్ళు చెరిపేయగలదు ఎదురులేక ఏగగలదు, జీవశ్చవాలుగా పూడ్చేయగలదు ప్రకృతితో పరాచకం ప్రపంచ జీవన హననం పంచభూతాల ప్రకోపం ప్రపంచానికి శాపం జీవన క్రాంతికి విఘాతం, విశ్వ విధ్వంసం దానితో మమేకం, హరిత భరితం, నిత్యానందం మానవ జీవితం ప్రకృతి దయా దాక్షిణ్యం అనంత శక్తికి మోకరిల్లడం అందరికీ క్షేమం ప్రకృతిని ప్రేమిస్తే ఆనందం మన సొంతం ప్రకృతి పరిరక్షణ అందరి తక్షణ కర్తవ్యం. అనంత శక్తిని ఆరాధనతోనే మెప్పించాలి అవతార సృష్టిని అభిమానంతో ఆదరించాలి అందరి ప్రకృతి ఆదరణతోనే విశ్వం విఖ్యాతం ఆదిశక్తి అనుగ్రహం ప్రత్యేకం, ప్రస్ఫుటం, ప్రశాంతం

123

Z.P.H.S పెంచికల్ దిన్నె

  Z.P.H.S పెంచికల్ దిన్నె , ఈ school చుట్టు పక్కల దాదాపు 20 kms పరిధిలో ఒక్క High School కూడా లేదు. కావున ఈ School కు నేరేడుచర్ల , ఫతేపురం ,Vaikuntapuram,మేడారం , కల్లూరు, దాచారం, సోమవరం గ్రామాలనుండి విద్యార్థులు, 6th class to HSC చదువుకొనుటకు వచ్చేవారు. ఈ school లో చదువుకొనుటకు 10 to 12 km వరకు నడచి వచ్చి చదువుకునేవారు. ఈ school లో చదువుకున్న విధ్యార్థులు ఉన్నత విద్యలు అభ్యసించి govt. ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఈ స్కూల్ పేరు నిలబెట్టారు ప్రభుత్వంలో చేరి వివిధ హోదాలలో సేవలు అందించినారు. ఈ School లో 1968-69 Batch అందరూ తెలంగాణ agitation batch అని పిలుస్తారు ఈ బ్యాచ్ గురించి కొన్ని విశేశాలు తెలుసుకొందాము. 1970 year తర్వాత HSC అనే Course ఆపేశారు. 1969 year బ్యాచ్ 1st Batch of S.S.C. & last Batch of H.S.C. 1969 year ఈ బ్యాచ్ వాళ్లు H.S.C&S.S.C వాళ్లు తెలంగాణ ఉద్యమం వలన 6 నెలల విద్యాసంవత్సరము కోల్పోయిగారు. 1968-69 Batch విద్యార్థులు పలు ఉద్యమాలను Success చేసినారు. Penchikaldinne నుండి Nereducherla వరకు నడుచుకుంటూ వెళ్ళి ఉద్యమం చేసినారు . అందులో మొదటిది - "వ...

కృష్ణలీలలు

6. మృద్భక్షణము - విశ్వరూప దర్శనము 7. కాళియ మర్దనము 8. పూజాఫలము. . 9. గోపికా వస్త్రాపహరణం 10. భగవత్కృప . 11. గోపికాగీతం . 12. కృష్ణస్తు భగవాన్ స్వయం

ఈ లోకమనే యంత్రం భగవంతుని మీద ఆధారపడి ఉంది, ఆయన శక్తి ద్వారా పనిచేస్తున్నది

ఈ లోకమనే యంత్రం భగవంతుని మీద ఆధారపడి ఉంది, ఆయన శక్తి ద్వారా పనిచేస్తున్నది   భగవచ్చింతన ఎన్నడూ మానవద్దు. నీకు ఆనందం కలిగినా, కలుగకపోయినా క్రమవిధానంలో నిత్యం ధ్యానం చేస్తూనే ఉండు. వదలకుండా, స్థిరంగా అభ్యాసం చెయ్యగలిగితే. మళ్ళీ నీవు ఆనందాన్ని అనుభవిస్తావు. వ్యాసమహర్షి ఇలా చెప్పారు: పైత్యరసంప్రకోపిస్తే చక్కెర రుచించదు. కానీ, శ్రద్ధగా ప్రతిరోజూ చక్కెర తింటూ ఉంటే, పైత్యప్రకోపం నయమై పంచదార రుచిని నెమ్మదినెమ్మదిగా ఆస్వాదించడం. మొదలుపెడతావు," ఇదే విధంగా 'అవిద్య' లేక అజ్ఞానం వల్ల పారమార్ధిక సాధనలు రుచించవు. కానీ జపధ్యానాలు వదలకుండా నిత్యం ప్రేమ, ఉత్సాహాలతో చేస్తూ ఉంటే అజ్ఞానం వల్ల కలిగిన విషాదం నశించి, భగవత్ప్రేమ (భక్తి) జనిస్తుంది. కాబట్టి ఎన్నడూ ఆధ్యాత్మిక సాధనలు వదలవద్దు. మరింత హృదయపూర్వకంగా వాటిని కొనసాగిస్తూ ఉండు. చివరకు వాటి నుండి ఆనందాన్ని పొందుతావు. కర్మఫలాల గురించి ఎందుకంత శ్రద్ధ చూపిస్తావు? నీ పనులను చేస్తూ ఉండు. ఈ లోకంలో యజమాని తన ఉద్యోగస్తులకు జీతం ఇస్తూనే ఉంటాడు. తన కోసం పనిచేస్తున్న నీకు భగవంతుడు ఏమీ ఇవ్వకుండా ఉంటాడా? నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు. "నేనేమీ సాధి...

భాధ్యతగా నేను! #Kallem Naveen reddy

  భాధ్యతగా నేను! #Kallem Naveen reddy  భాధ్యతగా నేను! ఓర్వలేని తనాలకు బెదిరింపులకు భయపడే వాడిని కాను నా జీవితమే నిత్యం ఒక పోరాటం అతనికై నా ప్రయాణం కొనసాగుతున్నప్పుడు నన్ను ఎంతమంది ఎత్తిపొడిచిన నాతో పాటుగా మీ రోమాలు నిక్కబొడుచుకునేలా పనిచేస్తా నా అడుగులు అతనితో రేపటి భవిష్యత్ తరాల కోసం! నా ఆలోచనలతో ప్రాంగణమంతా అందంగా అలుకుతూనే ఉంటాను ఉత్సాహమై అక్షరాలతో నిత్యం అనేక తోరణాలను కడుతూ భావాలను ప్రతి హృదయంలో పూయిస్తాను! నేను అజ్ఞానంకే శత్రువునీ కావచ్చుగాక కానీ విజ్ఞానానికి మాత్రం కాదు! - Kallem Naveen Reddy