నీరు అంటే కేవలం ఒక చుక్క కాదు- Kallem Naveen Reddy
నీరు అంటే కేవలం ఒక చుక్క కాదు
ఒక రైతు ప్రాణం, ఒక పల్లె ఊపిరి, ఒక రాష్ట్ర భవిష్యత్తు!
కేసీఆర్ గారి పాలనలో మండుటెండల్లో కూడా
చెరువులు నిండుగా ఉండేవి
ఆ నీటిలో రైతు నమ్మకం కనిపించేది
తెలంగాణ ఆత్మగౌరవం ప్రతిబింబించేది!
ఈరోజు మాత్రం సాగునీటి కోసం
రైతు ఎదురు చూస్తున్నాడు
త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు!
నీటి విలువ తెలియని నాయకత్వం చేతుల్లో
తెలంగాణ పడి అరిగోసలు పడుతుంది
చెరువులు మాత్రమే కాదు
ప్రజల ఆశలు కూడా ఎండిపోయాయి
చెరువులు నింపడం అంటే
కేవలం నీళ్లు పోయడం కాదు
ప్రజల జీవితాలను నిలబెట్టడం!
నీటిని కాపాడిన పాలన గొప్పతనం
అధికార కుర్చీలో కూర్చున్న ప్రతి ఒక్కరికీ అర్థం కాదు
అందుకు ప్రజల దాహం తెలుసుకోవాలి
రైతు కన్నీటి బరువు తెలుసుకోవాలి
ఈ తెలంగాణ నేల గుండె చప్పుడు వినాలి!
అందుకే మీ విలువ
మీ పాలన విలువ
మీరు నిర్మించిన నీటి సంస్కృతి విలువ
తెలంగాణ ప్రజలకు తెలుసు
తెలియనిది మాత్రం
నీటి చరిత్రను చదవని
తెలంగాణ ఆత్మను అర్థం చేసుకోని
నేటి పాలకులకే!
- Kallem Naveen Reddy
Comments
Post a Comment