మంచిమాటలు
161. ఆరాటం ఎక్కువైతే - ఆందోళన పెరుగుతుంది ఆందోళన పెరిగితే - ఆరోగ్యం తరుగుతుంది
ఆరోగ్యం తరిగితే - ఆయుస్సు తగ్గుతుంది; ఆయుస్సు తగ్గితే - అసలుకే ముప్పు వస్తుంది; ఉన్న
విషయం ఇది - ఆలోచించి నిర్ణయించుట నీ విధి.
162. ఆవేశం తగ్గించు - ఆలోచన పెంచు 163. కక్షను - కొనసాగించకు ; కరుణను - వదులుకోకు
164. మానవ శవాన్ని తాకితే - స్నానం చేయాలంటారు జంతువుల శవాన్ని మాత్రం
తింటానంటారు; శవాలకు శ్మశానం వుందని - మరువకు నీ కడుపు శ్మశానం - కానివ్వకు;
జీవకారుణ్యం గురించి - వివరిస్తానంటావు; జీవాలను మాత్రం - తింటానంటావు; మందు
తింటానంటావు - పథ్యం ఆచరించనంటావు; మందు కంటే పథ్యమే ముఖ్యమని -
తెలుసుకోమంటాను. 165. దురాచారుడే - దుష్టుడు;సదాచారుడే - సాధువు
దురాచారమును- దులపండి; సదాచారమును - పొందండి
166. అహంకారము - వద్దు ; ఉపకారమే - ముద్దు 167. విశ్వమును - నమ్మకు ;
విశ్వేశ్వరుని - నమ్ముము. 168. నీ బరువు - కాటాకు తెలుసు ; నీ తెలివి - అందరికి తెలుసు;
నీ శక్తి - నీకే తెలుసు- నీ బలహీనత - అందరికి తెలుసు. 169. నీవు సమర్థుడవని -
నీవే సర్టిఫికెట్టు ఇచ్చుకోకు - నీకు నీవే ఇచ్చుకున్న- సర్టిఫికెట్ విలువలేనిదని;
తెలుసుకో- వంతపాడుటకు
వంది మాగదులంటారు.; పనైతే - పలాయనం చిత్తగిస్తారు.; కాకుంటే - నీపై నిందల
వర్షం కురిపిస్తారు.; అందుకే ఉండాలి- నీ జాగ్రత్తలో నీవు బహు జాగ్రత్తగ.
170. నోరు మంచిదైతే ఊరు మంచిదగును; ఊరు మంచిదైతే - ఉల్లాసం అధికమగును
171. నీతులు చెప్పువారు నిండుగా వున్నారు.; ఆచరించేవారు. - అరుదుగ వున్నారు.
అన్నిటికంటే సులభం - నీతులు చెప్పడం; అన్నిటి కంటే కష్టం - వాటిని ఆచరించుట
172. చట్టాలు చేస్తారు - చుట్టాలుగ మారుస్తారు. ఇదేమంటే - అంతేనంటారు.
173. చెడు ఆలోచనలతో - చెడిపోవద్దు; మంచి ఆలోచనలతో - మనిషిగ బ్రతుకు
నీతి నియమం ఉంటే - నరుడే నారాయణుడు. 174. దేహ శుద్ధి - కొంతవరకే అవసరం
చిత్త శుద్ధి, త్రికరణ శుద్ధి - అందరికి అవసరం 175. చెడు చేయకు మంచిని వదలకు
చెడు తలపెట్టకు - మంచిని వదిలిపెట్టకు 176. డబ్బుతో - అవసరములు సమకూరును
అత్యధిక డబ్బుతో - విలాసములు సమకూరును.; సంతృప్తితో - శాంతి సమకూరును
అసంతృప్తితో - అశాంతి వెంటాడును.
177. స్వచ్ఛమైన మానవత్వమే - దైవత్వము; కరుణ - మానవత్వము; కాఠిన్యము - రాక్షసత్వము
178. గౌరవానికి హాని కలిగించకు - అగౌరవాన్ని పెంచి పోషించకు.
179. పశుత్వాన్ని పారద్రోలుము; మానవత్వాన్ని - చేరదీయుము
దైవత్వాన్ని పొందగోరుము. 180. మనలను - పొగుడుతున్న అబద్దాన్ని
త్వరితంగా - స్వీకరిస్తాం; మనకు - చెడు గలిగే నిజాన్ని - జీర్ణించుకోలేక ఏడుస్తాం
181. బహిరంగంగా కనిపించే - మురికి గుంట వలన ప్రమాదం - తక్కువ ;
మనస్సులో మాలిన్యం - గల వ్యక్తుల వల్ల ప్రమాదం ఎక్కువ.
182. చెడు వాగుడు వాగి - చెడిపోకు నోటిని కలుషితం చేసుకోకు; కాలుజారితే - కొంత బాధను
తెలుసుకో ; నోరు జారితే - అమితబాధని గ్రహించు; నోటిని అదుపులో ఉంచుకొనుట మంచిదని
భావించుకో; నోటికి మీటరు అవసరమని తెలుసుకో; ఆ మీటరు బిల్లు - పెరగకుండా చూసుకో
183. పుచ్చుకొనుట - అందరికి తెలుసు - ఇచ్చుకొనుట - కొందరికే తెలుసు.
184. కొన్ని - చూడదగినవి- మరికొన్ని - వినదగినవి- కొన్నే - జీర్ణించుకోదగినవి
185. ముందు - వినాలి - తదుపరి - గ్రహించాలి - ఆపై - ఆలోచించాలి - అటుపై -
నిర్ధారణ చేసుకోవాలి - ఆ తరువాతనే - మాట్లాడాలి.. 186. దైవాన్ని - పూజించు -
జీవున్ని - ప్రేమించు
జీవులను బాధిస్తూ - దేవుని పూజిస్తే - ఆవగింజంత - ఫలితముండదని భావించు.
187. నిజాలనే పలుకు - నిజాయితీగా బ్రతుకు- నొప్పించే మాటలు - వద్దు.
మెప్పించే మాటలు - మరవవద్దు- మనస్సును గాయపరచవద్దు - మనిషికి చేటు తేవద్దు
188. మంచినే నేర్చుకో - మంచినే అమలు పరచుకో- అపకారం చేయకు - అధోగతి చెందకు
ఉపకారం చేసి - ఉత్తమ గతి పొందుము. 189. గౌరవము నీకు అవసరమని భావిస్తావు
అందరికి - అనవసరమని ఊహిస్తావు. 190. మర్యాదను పుచ్చుకొనుటలో - శ్రద్ధ చూపిస్తావు
ఇచ్చుకొనుటలో - అశ్రద్ధ చూపించకుము. 192. అనుకూలములో ఆనందించుట
అందరికీ తెలుసు. ప్రతికూలములో - ఆందించుట కొందరికే తెలుసు.
193. చెడ్డపని చేస్తావు - మంచి తనాన్ని మంట కలుపుతావు- చెడ్డపని చేయకు -
మంచితనాన్ని మానకు.
194. సత్యం కొరకు - దేనినైనా వదలుకో- సత్యాన్ని దేనికోసం - త్యాగం చేయకు
195. సహనం కన్నా - సాహసం మిన్న. సాహసంతో - సమస్తం సాధించగలరన్న
నీ శక్తినంతా - మంచి పనులకే ఉపయోగించన్న. 196. పరులను - పీడించుటకు
ప్రణాళికలను -సిద్ధపరచకు; పరులకు - సహకరించుటకు నీ శక్తి యుక్తులను
ఉపయోగించుట మరువకు.
197. మంచి చేయుటకు - ముందుండుము; ఆటంకాలను - అదర కొట్టుము
198. నీ ప్రవర్తన ప్రపంచానికి - ప్రయోజనం కావాలి. అదే నీ జీవిత ధ్యేయంగా - మారాలి
199. బోధనలు - బాధలు కారాదు; బోధనలతో - బాధలు తీరాలి-ఆనందం -
అందరికీ అందివ్వ గలగాలి. 200, శాంతిని - పంచాలి.; అశాంతిని - అణ చాలి.
201. నీవు మరణించినా - ప్రజల హృదయంలో జీవించగలగాలి; నీవు జీవించినా -
ప్రజల హృదయంలో మరణించరాదు. 202. మానవత్వానికి - మచ్చ రానీయకు-
మానవత్వమే - మధురమైనదని మరువకు.
203. గుడికి ఎందుకు రాలేదని.- ఏ దేవుడు - ప్రశ్నించడు; పరులకు ఎందుకు -
మేలు చేయలేదని మాత్రం తప్పక - ప్రశ్నిస్తారు. 204 హింసను - ప్రేరేపించకు-
అహింసను-వదిలి పెట్టకు. 205. నీవు - స్వతంత్రుడవే - ఎవరూ కాదనరు -
ఇతరులను హింసించుటకు
దానిని ఉపయోగించకు. 206. పాపిని - దూషించకు - పాపాన్ని - దూషించు
పాపాన్ని - వదిలించు - పాపిని - రక్షించు. 207. కల్లు - తాగిన వానిని - కైపు - ఆడిస్తుంది.
కల్లును - ద్వేషించు - మనిషిని - రక్షించు. 208 ఎవరి కోపం - వారిని ఆడిస్తుంది.
- ఎదుటి వారిని - హింసిస్తుంది. 209. కోపం - తెప్పించినవానిని - ఓడించాలని - భావించావా!
- నీవు - కోపాన్ని అణుచుకో కోపం తెప్పించిన వానిని గెలిపించి - నీవు ఓడిపోవాలని భావించితివా!
కోపగించుకుని - నీ కొంప నీవే ముంచుకో. 210. స్వయం కృషిని - నమ్ముకో అంతా
మంచియే జరుగునని అనుకో.
211. దురదృష్టమని - దిగజారిపోకు అదృష్టముపై - ఆశ వదులుకోకు.
212. ఆత్మ బలమే - అధిక బలము; మనో బలమే - మంచి బలము; ఆత్మ సాక్షిని - అదిమి
పెట్టకు మనస్సాక్షిని - వదిలిపెట్టకు. 213. నీ వైఫల్యాన్ని - ఇతరుల మీద నెట్టకు;
నీ సాఫల్యాన్ని - ఇతరులతో పంచుకో. 214. ప్రపంచం ఏ ఒక్కడి - సొత్తూ కాదు ఇందులో
అందరికి వాటా ఉంది. నాది నాది అని దాచుకున్నా- దాగదు ఏదీ నీది కాదు అంతా
నాదే అంటుంది ప్రకృతి. 215. ఎంత ఎత్తుకు - చేరుకున్నావనేది ముఖ్యం కాదు అంత
ఎత్తుకు - ఏ విధంగా చేరుకున్నావనేది ముఖ్యం. 216. గందరగోళం చేసి - గలాటాలు చేయవద్దు;
సమస్యను సామరస్యంగా పరిష్కరించుట మరవవద్దు. 217. సహకరించుటకు సమయం లేదని
సరిపెట్టకు - మనస్సుంటే - మార్గముంటుందని మరువకు. 218. మంచి చేస్తానని మాట ఇవ్వు
ఇచ్చిన మాటకు - కట్టుబడి ఉండు.
219. చెప్పవలసింది - సూక్ష్మంగా చెప్పు వివరిస్తానని - సమయాన్ని అరగదీయకు.
220. పరులను బాధించా - నీవు రోధిస్తావని తెలుసుకో పరులకు సహకరిస్తావా - నీ పని
సఫలమయ్యిందని తెలుసుకో. 221. అధికారం కొరకు అడ్డదారి త్రొక్కకు - అడ్డదారి -
అంధకారమని మరువకు. 222. వద్దన్నా వచ్చిన అధికారమే నీకు ముద్దు - అహంకారమే -
నీకు వద్దు. 223. హద్దు లేని - ఆశ వద్దు - హద్దులోనే వుంది ముద్దు - అత్యాశ - అసలే-వద్దు.224. సముద్రం కన్నా సహనం మిన్నా
Comments
Post a Comment