Posts

Showing posts from February, 2024

సనాతన సౌరభాలు గ్రంధం నుండి

సనాతన సౌరభాలు గ్రంధం నుండి 1. మరణించిన తరువాత జీవుని స్థితి 2. పితృకర్మల గురించిన వివరణ మరణం తరువాత జీవాత్మ పరిస్థితి ఈ లోకంలో ప్రతీమనిషి శాశ్వతంగా ఉండిపోతాననే అనుకుంటాడు. పుట్టిన క్షణం నుండి ప్రతిక్షణము తన ఆయుషు తగ్గుతునే ఉంటుందని తెలియదు, వేసే ప్రతి అడుగు మృత్యువు వద్దకే అని తెలియదు. తనకు ఉన్నnఆయుర్దాయం ఎంతో తెలియదు. కుటుంబము, సంసారము అంటూ బంధాలు, అనురాగాలు పెంచుకుంటూనే ఉంటాడు, అకస్మాత్తుగా మరణం సంభవించేసరికి జీవాత్మ తట్టుకోలేకపోతుంది. శరీరంలో జీవం పోగానే దానిని భౌతికకాయం అంటారు. జీవాత్మ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించే ప్రయత్నాలు చేస్తుంది. నేను ఇక్కడే ఉన్నాను అని అరుస్తుంది. జీవాత్మకు తన భౌతికకాయం వద్ద రోదిస్తున్న వారందరూ కనిపిస్తుంటారు. వారి రోదనలు వినిపిస్తుంటాయి. కాని వాళ్ళకు జీవాత్మ కనిపించదు, జీవాత్మ గోడు వినిపించదు, అంతిమ ప్రయాణం మొదలవగానే జీవాత్మకు దుఃఖం ఆగదు. తనదేహం నాశనమయే సమయం సమీపిస్తుందని రోదిస్తూ భౌతికకాయంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. దహనం లేక ఖననం జరిగిన తరువాత జీవాత్మ ఇంటికే వచ్చేస్తుంది. పెద్దకర్మ అయిన వరకు ఇంటిలోనే ఉండి తను జీవించినంతకాలం ప్రేమించి పోషించినవారు తన