Posts

Showing posts from July, 2023

15th chapter 7th slokam

శ్లో॥ మమైవాంశో జీవలోకే జీవభూత స్పనాతనః మన షష్ట్మాణీవ్రియాణి ప్రకృతిస్థావి కర్షతి! || 7 || సవాతనమైన నా అంశమే జీవలోకము నందు జీవుడై ప్రకృతిలోని ఆరు ఇంద్రియములను ఆకర్షించుచున్నది. 15 వ అధ్యాయము  పురుషోత్తమప్రాప్తి యోగము 7 వ శ్లోకము  అర్జునా! సనాతనమైన నా అంశమే సంసారంలో జీవ రూపంతో ఉంది. ప్రకృతి లోని ఇంద్రియ మనస్సులు ఆరింటికి తన వైపుకు ఆకర్షిస్తూ ఉంది. వ్యాఖ్య నేను ఉన్నాను (అహమస్మి) అనే వాక్యములో 'నేను' అనే పదము దేహానికి సంబంధించింది కాదని, ఇంద్రియాలకు సంబంధించింది కాదని, ప్రాణానికి సంబంధించింది కాదని, మనస్సుకు సంబంధించింది కాదని ఇప్పటికే మనం తెలుసుకున్నాం. అలాగే ఈ లోకములో 'నేను' అనే వస్తువు లేదని కూడా అర్థం చేసుకున్నాం. 'నేను' అంటే జీవుడు. చైతన్య రూపుడు. 'నేను' అటూ నేను పలుకుతున్నాను. నీవూ పలుకుతున్నావు. ఆమె కూడా పలుకుతోంది. ఇలా అనేక మంది 'నేను - నేను' అంటూ ఉన్నారు. మరి ఈ 'నేను' యొక్క లక్షణాలు మనిషి మనిషికి భిన్నంగా ఉన్నాయా? లేవు. ఎందరు పలికినా, ఎవరు పలికినా 'నేను' ఒక్కటే. 'అహం' శబ్దార్థ మొక్కటే. అదే జీవుడు. సద్రూపుడు. ఏక సద్ర