Posts

Showing posts from October, 2026

ఊరేగుతున్న పరాభవ రుచి!..కోట్ల వెంకటేశ్వరరెడ్డి 9440233261

ఊరేగుతున్న పరాభవ రుచి!..కోట్ల వెంకటేశ్వరరెడ్డి 9440233261 నీటికి ఆత్మగౌరవం ఎక్కువ జారవిడుచుకుంటే అవి వెనక్కి మళ్లి చూడవు! పాలమూరు పొలాలు దాహంతో విలవిల్లాడుతుంటే ఇంగితం కోల్పోయినందుకు పైవాడితో కాళ్ళ బేరం ! కాలం ఒక వైపు కన్నెర్రజేస్తుంటే పట్టింపు కరువైన పాలన జనం లోపల హేళన! అతిథైన విద్యుత్తు రాకపోకల మర్మమెరుగక ఆందోళనలో అన్నదాత భవిష్యత్తు! కరువు రుచి ఎరిగిన వాడిగా చెప్తున్న రాబోయే కాలం యుధ్ధానంతర దృశ్యమే! నీళ్లు మనవే పరాయి పొలాలలో పరవశిస్తుంటే మా లోపలి దుఃఖానికి ఈ నలుపు రంగు సరిపోదు! ఏవేవో ఇస్తానంటే చేస్తానంటే ఊహకు మించి మద్దతిచ్చిన వాళ్లున్నరు చూస్తూ ఊరుకుంటారా? గమనించడం లేదా యుద్ధం రాకముందే మీ పరాభవ రుచి ఊరూరా ఊరేగుతున్నది! కోట్ల వెంకటేశ్వరరెడ్డి 9440233261