Z.P.H.S పెంచికల్ దిన్నె
Z.P.H.S పెంచికల్ దిన్నె, ఈ school చుట్టు పక్కల దాదాపు 20 kms పరిధిలో ఒక్క High School కూడా లేదు. కావున ఈ School కు నేరేడుచర్ల , ఫతేపురం ,Vaikuntapuram,మేడారం , కల్లూరు, దాచారం, సోమవరం గ్రామాలనుండి విద్యార్థులు, 6th class to HSC చదువుకొనుటకు వచ్చేవారు. ఈ school లో చదువుకొనుటకు 10 to 12 km వరకు నడచి వచ్చి చదువుకునేవారు. ఈ school లో చదువుకున్న విధ్యార్థులు ఉన్నత విద్యలు అభ్యసించి govt. ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఈ స్కూల్ పేరు నిలబెట్టారు ప్రభుత్వంలో చేరి వివిధ హోదాలలో సేవలు అందించినారు. ఈ School లో 1968-69 Batch అందరూ తెలంగాణ agitation batch అని పిలుస్తారు ఈ బ్యాచ్ గురించి కొన్ని విశేశాలు తెలుసుకొందాము. 1970 year తర్వాత HSC అనే Course ఆపేశారు. 1969 year బ్యాచ్ 1st Batch of S.S.C. & last Batch of H.S.C. 1969 year ఈ బ్యాచ్ వాళ్లు H.S.C&S.S.C వాళ్లు తెలంగాణ ఉద్యమం వలన 6 నెలల విద్యాసంవత్సరము కోల్పోయిగారు. 1968-69 Batch విద్యార్థులు పలు ఉద్యమాలను Success చేసినారు. Penchikaldinne నుండి Nereducherla వరకు నడుచుకుంటూ వెళ్ళి ఉద్యమం చేసినారు . అందులో మొదటిది - "విశాఖ ఉక్కు - ఆంధ్రులహక్కు", రెండవది " తెలంగాణ ఉద్యమం " . "తెలంగాణ బంద్ " ఉద్యమంలో Nereducherla లో Busses & Trafic మొత్తం నడవకుండా చేసి అక్కడి నుండి Huzurnagar వరకు నడుచుకుంటూ వెళ్ళి తెలంగాణ బంద్ సంపూర్ణంగా విజయవంత చేసినారు. తెలంగాణ బంద్ సందర్భంగా బస్సులు ఆపకపోతే బస్సుల టైర్ నుండి గాలి తీయటము బస్సులు నడవకుండా చేయడం మరియు glasses damage చేసి ఉద్యమం విజయవంతం చేసినారు. విద్యార్థులు అత్యంత పట్టుదలతో, దీక్షతో మన తెలంగాణ మనకు కావాలి అనే దృఢదీక్షతో ఉద్యమంలో పాల్గొన్నారు, పోలీసులు భగ్నం చేసేందుకు విధ్యార్ధుల వెంటబడి తరుముతుంటే పంటపొలాల వెంటబడి పరిగిగెత్తే వాళ్ళు పోలీసులు వెళ్ళగానే మళ్ళీ యధావిధిగా ఉద్యమాన్ని నడిపించారు. ఆ రోజులలో వార్తాపత్రికలు గ్రామాలకు చేరక పోయేవి, ఒక్క రేడియా వార్తలు మాత్రమే అందరు వినగలిగే నారు, ఉద్యమం విజయవంతం అయినట్లుగా రేడియోలో వినగానే ఉద్యమంలో పడిన బాధలు,కష్టాలును మరచిపోయి సంతోషంతో మన తెలంగాణ మనకు త్వరలో రాగలదని ఆశతో ఎదురు చూచేవారు.
Comments
Post a Comment