భాధ్యతగా నేను! #Kallem Naveen reddy
భాధ్యతగా నేను! #Kallem Naveen reddy
భాధ్యతగా నేను!
ఓర్వలేని తనాలకు
బెదిరింపులకు భయపడే వాడిని కాను
నా జీవితమే నిత్యం ఒక పోరాటం
అతనికై నా ప్రయాణం కొనసాగుతున్నప్పుడు
నన్ను ఎంతమంది ఎత్తిపొడిచిన
నాతో పాటుగా మీ రోమాలు
నిక్కబొడుచుకునేలా పనిచేస్తా
నా అడుగులు అతనితో
రేపటి భవిష్యత్ తరాల కోసం!
నా ఆలోచనలతో ప్రాంగణమంతా
అందంగా అలుకుతూనే ఉంటాను
ఉత్సాహమై అక్షరాలతో
నిత్యం అనేక తోరణాలను కడుతూ
భావాలను ప్రతి హృదయంలో పూయిస్తాను!
నేను అజ్ఞానంకే శత్రువునీ కావచ్చుగాక
కానీ విజ్ఞానానికి మాత్రం కాదు!
- Kallem Naveen Reddy
Comments
Post a Comment