చైతన్య చేమంతులు

20. బుద్ధితో తెలుసుకొనేది ప్రపంచజ్ఞానము. బుద్ధిలో తెలిసేది పరమాత్మ జ్ఞానము. పరమాత్మది సర్వ జ్ఞానము, జ్ఞానమైనా పరమాత్మ జ్ఞానం లోనే ఇమిడి ఉంది. 21.రాత్రంతా ప్రపంచంలో చీకట్లు ముసురుకున్నా, మన కంటిలో చీకటి లేకపోతే తెల్లవారగానే వెలుగులు కళ్ళముందు ఆరబోసు కుంటాయి. 22. ఆలోచనల నుండి విడిపడటం అసంగత్వం కాదు. అది యోగం. ధ్యాన యోగం. ఆలోచనలు ఉన్నా సంగత్వం లేదని తెలియడమే అసంగత్వం. ఇది జ్ఞానం. ఆత్మజ్ఞానం. 23. నిశ్శబ్దాన్ని పాటించడం కర్మ. నిశ్శబ్దమై ఉండటం జ్ఞానం. అదే మౌనవ్యాఖ్యానం. పరమాత్మను ప్రకటించే మౌన వాక్యం. 24. ఉన్నది ఏదైనా, అది నీవైనా కావాలి. లేదా, నీ అనుభవంగా నైనా ఉండాలి. మొదట నీవు ఉంటే, ఆతరువాత అనుభవాలు కలుగుతాయి. అనుభవాలు లేక పోయినా నీవు ఉంటావు. అనుభవంఉంటే నష్టంలేదు. అనుభవమే జ్ఞానము అనుకుంటే లాభంలేదు. 25. ఏదో చెయ్యాలి అనే ఆలోచనకన్నా, ఎలా ఉండాలి? అనే ప్రశ్నపడితే, లేదా ఆలోచన పుడితే, ఆ క్షణంనుండే జీవితం ఒక అందమైన మలుపుతిరుగుతుంది. 26.మనం కష్ట పడటానికి మరొకరు ఉండాలి అనే నియమ మేమీ లేదు. కష్ట పడే మనసు ఉండాలే గాని, ఎవరూలేక పోయినా, అది కష్ట పడుతూనే ఉంటుంది. ఏదో ఊహించుకొని వ్యథచెందుతూనే ఉంటుంది. పరులను కష్ట పెట్టే మనస్సు ఎవ్వరూలేకపోతే తననే తాను కష్టపెట్టుకుంటుంది. మనం కష్ట పడకుండా మరొకరిని కష్టపెట్ట లేము. 27. మంచి ఆలోచనలు చేయలేకపోవడం శాపం కాదు కానీ, చెడు ఆలోచనలు చేయడం మాత్రంపాపమే. చూస్తేనే కనిపించేవి చూడకపోతే అగుపించవు. 28. జన్మించడం మన చేతిలో లేదు. జీవించడం మన చేతి లోనే ఉంది. పరిస్థితుల్ని మనం శాసించ లేము.ప్రవర్తనను మనం నియంత్రించుకోగలం. 29. వెన్న ఉన్న చోటే నెయ్యి ఉంది. గురువు ఉన్న చోటే గోవిందుడున్నాడు. గురుదేవుని సన్నిధిలో ప్రాప్తించే అక్షయ నిధియే దేవ దేవుడు. 30. వచ్చే జ్ఞాపకాలను ఆపడం మనిషికి ఎలా సాధ్యం కాదో, వచ్చిన జ్ఞావకా లతో కలిసి హాయిగా జీవించడం కూడా అలాగే సాధ్యంకాదు. విచారము లేకుండా విషాదమురాదు. ఆలోచనల నుండే ఆవేదనలు పుట్టు కొస్తాయి. 31. భగవంతుడు భవిష్యత్తులో ఎప్పుడో, ఎక్కడో కనిపించే వాడుకాడు. ఇప్పుడు, ఈ క్షణంలో కూడా భగవంతుడు మనతో కలిసే ఉన్నాడు.భగవంతుడు ప్రత్యేకంగా వచ్చేవాడుకాడు. పనిగట్టుకొని పోయే వాడూకాడు. సదాశ్వాసలాగా కలిసిఉండేవాడు. ఇదేజ్ఞానం. ఈశ్వరజ్ఞానం. 32. భగవంతుణ్ణి అర్థం చేసుకొనే శక్తిమనకు లేదు. కాని మన బాధలను, బాధల్ని పోగొట్ట మని మనం వినిపించేమొరను భగవంతుడు అర్థం చేసుకుంటాడు. భక్తు డైన వానికి ఇదేశ్రీరామ రక్ష. 33. ఇచ్చేందుకు వస్తువుల్ని, ఇచ్చేచేతుల్ని, ఇవ్వాలనే చిత్తాన్ని అన్నిటినీ పరమాత్మే మనకు అనుగ్రహించాడు.అవన్నీ ప్రసాదాలే. వాటిని అలాగే వినియోగించు కోవాలి. అదేసమర్పణము. 34. అవసరాలు ఉండొచ్చు. ఉంటాయి కూడా. అలాగని, ఆశలు ఉండ నవసరం లేదు. అవసరాలకు అవధు లుంటాయి. ఆశలకు హద్దులుండవు. ఆశ పెరిగేదే గాని తరిగేది ఉండదు. తోడు పెట్టినా, తోడు పడినాపెరుగుతూనే ఉంటుంది. పెరుగులా గడ కడుతూనే ఉంటుంది. శాంతితరుగు తూనే ఉంటుంది. 35. నాహం కర్తా హరిః కర్తా - నేను ఏదీచేయడం లేదు. అంతా శ్రీహరే చేస్తున్నాడు. ఈ భావన బుద్దిలో కదలగానే నీవు చేసే వాడివి కాకుండా, చేసే వాడిని చూచే వాడివి అవుతావు. 36. జీవితంలో ఏది నీది? ఎవరు నీవారు? నీ కున్నది నీది అవుతుందేగాని, నీది కావాలి అనుకున్నది నీదికాదు. ఆశించి పొంద లేనిది నీదికానపుడు, పొంది పోగొట్టు కొనేది మాత్రం నీది ఎలా అవుతుంది? 37. మనుషులు జలాన్ని పానంచేస్తారు. దేవతలు అమృతాన్ని పానంచేస్తారు. మహాత్ములు జ్ఞానామృతాన్నిపానం చేస్తారు (అర్ధ రసం పిబన్తః). అందుచేత మహాత్ములు జీవన్ముక్తులై శోభిస్తారు. 38. వివేకము అనేది అనుభవాలను పొందటం వల్ల కలిగేది కాదు; అనుభవాలను అర్థం చేసుకోవడంవల్ల మిగిలేది; దివ్యంగా వెలిగేది. 39. వైరాగ్య మంటే ఉన్న వాటినిత్యజించడము కాదు. అవసరం కానివి మనస్సులో చేరకుండా జాగ్రత్తవహించడమే వైరాగ్యము. 40. ఏ ధనమైనా వ్యయమే. క్షయమే. జ్ఞానమొక్కటే అక్షయ ధనం. ఈసత్యము నెరిగిన వారే ధన్యులు. ఎరుగని వారు అన్యులు. 41. జగతికి చీకట్లు తెలియనివికావు. జీవికి ఇక్కట్లు క్రొత్తవి కావు. ఈ ప్రపంచంలో ఎవడైనా బాటసారే. ఈ జగతి ఎవరి కైనా ఎండమావే. 42. బుద్ధి పారిపోతేపోనీ. భగవంతుడు జారి పోకుండాచూసుకో. చాలు. 43. ఏవో లేవని దుఃఖిస్తూఉంటాము. అవి మనకు అవసరాలుకావని, అందుకే మన వద్ద లేవనే సత్యాన్ని అర్థం చేసుకోము. 44. పరమాత్మ మనల్ని సేవకులుగా సృష్టించ లేదు. మనమే ఆ మహితాత్ముని ప్రభువుగా ఎన్నుకున్నాం. 45. నేత్రాలు మూసి పడుకున్ననిన్ను నిద్ర తన ఒడి లోకి తీసుకున్నట్లు, అంతర్ముఖు డవై ధ్యానంలో నిలిచిన నిన్ను పరమాత్మ తనలోకితీసు కుంటాడు. దైవాన్ని చేరా లంటే ధ్యానంచేసితీరాలి. 46. ప్రపంచం ఉండొచ్చు. కాని, దానిని గ్రహించే నీ కన్నా వేరుగాప్రపంచం ఉండ లేదు. అది - ఇది; అక్కడ - ఇక్కడ; అప్పుడు - ఇప్పుడు అనేవి తెలుస్తూ ఉండినా, అవేవీ చైతన్యమును దాటి పోలేవు. 47. ప్రవాసంలో విద్య మిత్రుడు. గృహంలో భార్య మిత్రురాలు. రోగంవచ్చినపుడు ఔషధము మిత్రుడు. మరణానంతరం ధర్మమే మిత్రుడు. మిత్రు డెవరో కాదు. మేలు చేసే వాడు మిత్రుడు. మేలుకొలిపేవాడు మిత్రుడు. 48. జీలకర్ర చేదు. బెల్ల మేమో తీపి. వాటిని ఇరువురూ కలిసిఅనుభవించాలని ఒకరి తలపై మరొకరు పెట్టుకుంటారు. ఆ తరువాత, ఎవరి తలలువాళ్ళు పట్టుకుంటారు. అదే సంసారమంటే. 49. బాలకృష్ణుని ఎన్ని కష్టాలుచుట్టు ముట్టాయో మనకుతెలియదా? అన్నిటినీ నవ్వుతూ ఆలింగనం చేసు కున్నాడు. ఎవరినీద్వేషించ లేదు. దేనికీ భయపడ లేదు. మందహాసాన్ని చిందిస్తూ అందరికీ ఆనందాన్ని పంచాడు. మనం కృష్ణ భక్తులం. మనమూ అలాగే జీవిద్దాం. 50. పరమాత్మ పాదారవిందమే సర్వులకు ఆధారము. కాని, భక్తులైన భ్రమరాలకు ఆ చరణార విందము ఆధార స్థానమే కాదు; ఆనందనిలయము కూడా.

Comments

Popular posts from this blog

15- 9th page

18-19