183 to 185

183. లేని దానిని వదిలేది ఉండదు. ఉన్నదానిని పొందేది లేదు. లేకనే ఉన్నట్లు గోచరించేది భ్రాంతి. ఉన్నది ఉన్నట్లు తెలియుటే శాంతి. నీవు కానిది, నీకు లేనిది లేదు; లేదు; లేదు. ఇది వినుటయే నీకు చేదు. ఇది నీ స్వరూప లక్షణం కాదు.

184, పూలు వాడిపోతాయి. దారము వాడిపోదు. నామరూపాలన్నీ నశించి పోతాయి. చైతన్యము దారములాగా. స్థిరంగా ఉంటుంది.

185. ధనం అన్నం పెడుతుంది; ఆకలి పుట్టించలేదు. కలిమి కలాన్ని కొని పెట్టగలదు; కవిత్వాన్ని కదిలించలేదు. సంపదలు అవసరాలను తీర్చవచ్చు. ఆవేదనలను తొలగించలేవు. ధనం దారిద్ర్యాన్ని  తొలగించగలదేమో గాని ఐశ్వర్యాన్ని ప్రసాదించలేదు.



Comments

Popular posts from this blog

15- 9th page

18-19