101 to 150

108. ఊహలన్నీ వాస్తవాలు కావు. అందుకే, ఎంత గొప్ప ఊహలైనా పువ్వు ల్లాగా కాలంలో వాడిపోతాయి. స్థిరంగా నిలబడటానికి ఊహలకు కాళ్ళులేవు. కానీ వాస్తవాలకు కాళ్ళే కాదు; రెక్కలు కూడా ఉన్నాయి. కనుక అవి నిలబడటమే కాదు; అవసరమైతే అంబరంలో విహరిస్తాయి కూడా. 109. తన ఆనందానికి తానే కారణమైన వాడుజ్ఞాని. కనుక జ్ఞానిఉన్నాడు అంటేనే ఆనందంగా ఉన్నాడు అనిఅర్థము. అనంతంగా ఉన్నాడు అని భావము. 110. ఎవరి కొరకు ఎవరూ లేరనే సత్యం ఏదోఒక రోజు వంటపట్టవలసిందే. ఆ రోజేదో ఈరోజే అయితే, ఈ క్షణం నుండే స్వేచ్ఛా గాలులు పీల్చుకోవచ్చు. 111. ఏ ఒక్కరూ మరొకరిని సుఖపెట్టలేరు. ఏవస్తువూ సదాసుఖాన్ని పంచలేదు. ఏ పరిస్థితి సర్వత్ర మనల్నిఆనందంగా ఉంచలేదు. ఇదేజీవితం మనకు నేర్పిన పాఠం. 112. సుఖ పడటానికి కోరికలు తీరనవసరం లేదు అనేదిఅర్థమైతే, ఆతరువాత కోరికలు ఉన్నా కష్టంఉండదు. కోరికలు తీరకపోయినా నష్టంవాటిల్లదు. 113. నీవు ఉంటేనే మనస్సుఉంటుంది. మనస్సు లేకపోయినా నీవుఉంటావు. నీవుగాని మనస్సు నిన్నెలా బాధ పెడుతుంది? 'మనస్సునేను' అనిభావించడంచేత ఏర్పడిన దుఃఖము 'నేను మనస్సును కాను' అనేసత్యాన్ని గ్రహించడం వల్లనేపోతుంది. 114. బాధించేది మనస్సయితే, బాధపడేది కూడా మనస్సే. మనస్సులో కూర్చుని బాధకు దూరం కాలేవు. నీవుఅసంగాత్మవు; సాక్షివి. ఈ సత్యం అర్థమైనపుడే నువ్వు సర్వ ఉపద్రవాల నుండి విముక్తిని పొందుతావు. 115. పరులను సుఖపెట్ట గలిగే శక్తిమనకు లేదు. కాని ప్రయత్నిస్తే ఇతరులను కష్టపెట్టకుండా జీవించగలం. ఈ పనిచేయగలిగితే మరోవిధంగా ప్రపంచాన్ని సుఖపెట్టినట్లే. 116. 'విధి' కాదెన్నడూ నీకునిధి.'అదృష్ట'మనేది ఒకచీకటిగది. 'విధి'నివిడిపోనీ. 'అదృష్టాన్ని' వీడిపోనీ. అర్హతలే ఏనాడైనా అందలమెక్కుతాయి. అవగాహనలే ఎప్పుడైనా గొడుగులు పట్టించుకుంటాయి. 117. అంతా శుభమే. ఉన్నదంతాశుభమే. అశుభమనేది కల్పితము;ఆరోపితము. కనుకమనం చేయవలసింది శుభాన్నికాంక్షించడంకాదు;శుభాన్నివీక్షించడము. 118. ఉన్నది తెలియాలి. ఉన్నది అనేజ్ఞానం కలగాలి. ఆతరువాత, అంతాఉత్సాహమే. ఉత్సవమే. మహోత్సవమే. జ్ఞానమహోత్సవమే. 'నేను'లేకుండా 'నేను' ఊరేగే విజ్ఞానమహోత్సవం. 119. బ్రతుకులో ఏదైనా జరగవచ్చు. బుద్దిలో ఏదీ జరగకుండా ఉండాలి. అలాఉండాలంటే, భగవంతుడుతోడుగా ఉండాలి. నీడలా ఉండాలి. బుద్ధిలోనిండాలి. భక్తిలో బుద్ధిపండాలి. 120. గాలి అంతటా ఉన్నా, పీల్చినవారికే అది ప్రాణమవుతుంది. ఈశ్వరుడు సర్వత్ర ఉన్నా, పిలిచినభక్తులకే అతడు రక్షకుడవుతాడు. 121. బాగుతెలియాలి అంటేఆలకిస్తే సరిపోతుంది. బాగుపడాలి అంటేమాత్రం ఆచరించితీరాలి. ముక్తి సౌధానికి భక్తియేదారి. ముందుదారిలో పడితే, తరువాత ద్వారదర్శనం. జ్ఞానమే ద్వారము. ఆతరువాత దైవదర్శనం. 122. గతాన్ని అంగీకరించలేని దౌర్బల్యం వర్తమానాన్ని పూడ్చేస్తుంది. భవిష్యత్తును కాల్చేస్తుంది. సుఖాలనుఊడ్చేస్తుంది. శాంతిని బ్రతుకులోరాల్చేస్తుంది. 123. ఈశ్వరుడులేనివాడు కాడు; ఉన్నవాడే. ఉన్నవాటిలో సత్యంగాఉన్నవాడు. ఉన్నవన్నీ పోయిననాడు, పోకుండా వెలుగుతూ ఉండేవాడు. లేనివారికి ఉన్నవాడు. ఉన్నవారిలో ఊరేగేవాడు. 124. తలంచిన ఆలోచనలు |తలలో ఒత్తిడిని పెంచుతాయి. మనకు ఏదిఎప్పుడు ఎక్కడఎలాఇవ్వాలో సర్వేశ్వరునికి తెలుసు. ఆ దివ్యాత్ముని పదసరోజాలను ఆశ్రయించుకొని జీవించడమే మనకర్తవ్యం. 125. గుడి గోడలు కూలి పోవచ్చు. గుండెచప్పుళ్ళు ఆగిపోవచ్చు. నిండుబావులు పూడిపోవచ్చు. చెరువుగట్లు తెగిపోవచ్చు. కూలిపోనిది, ఆగిపోనిది, పూడిపోనిది, తెగిపోనిది భక్తి ఒక్కటే. ఉన్ననాడు తోడుగాఉంటుంది.పోయేనాడు తోడునడుస్తుంది. 126. పగటికి ప్రభాకరుడు భూషణము. నిశికి శశి అందం. అహర్నిశలు జీవికి భక్తియేఅందం. జ్ఞానమేభూషణం. 127. ఆకాశంలో చంద్ర తారకలువెలుగుతూ ఉండొచ్చు. కాని,తెల్లవారాలంటే సూర్యుడు ఉదయించవలసిందే. అరువుతెచ్చుకున్న భావాలతో ఎందరు మిథ్యాజ్ఞానాన్ని బోధిస్తున్నా. సద్గురువు ఉపదేశించినపుడే సత్యజ్ఞానము శోభిస్తుంది. 128. దొంగకు రాత్రిఅనుకూలం. దొరకు పగలు అనుకూలం. భక్తునికిఅహర్నిశలు అనుకూలమే. సర్వేశ్వరుని ఆరాధించేవారికి అన్నికాలాలూ అనుకూలాలే. 129. ఇనుపముక్కను పడవలో ఉపయోగించినపుడు అదిమానవులను నదిని దాటించి తీరం చేర్చుతుంది. అదే ఇనుప ముక్కను బాణానికి తొడిగినపుడు నిలువునా ప్రాణాలను తోడేస్తుంది. సత్సంగములో రమించే మనస్సు తరింపచేస్తుంది. దుస్సంగములో చరించేమనస్సు అంతరింప చేస్తుంది. 130. బాధించే ప్రపంచానికి సేవలందిస్తూ పోవాలి. బాధలనునివారించే పరమేశ్వరునితో కలిసిజీవించడం అలవరచు కోవాలి. మేనుప్రపంచానికి; మనసు పరమేశ్వరునికి.ఇదే తరించేమార్గము. 131. ప్రపంచంలో ఏదీ ఆకర్షించలేనిస్థితికి నీవుచేరగలిగితే, ప్రపంచాన్నిఅయస్కాంతంలా నువ్వేఆకర్షిస్తావు. మోహపంకము అంటనిహృదయకమలాన్ని పరమేశ్వరుడు దివ్యంగా ప్రకాశింప చేయడమే దీనికి కారణము. 132. బాహ్యం లోని పోరాటాలకు ఆంతర్యం లోని ఆరాటాలే కారణాలు. నిజానికి అవే జీవన పోరాటాలు. సమర కవాటాలు. 133. ఇతరుల మాటలను ఓపికగా వినాలి. సంపన్నులను చూచి నపుడు కళ్ళు చల్లగా ఉండాలి. పరుల ప్రగతినిగాంచి హృదయం పులకరించాలి. ఇలా జీవించ గల వారెవరైనా తప్పకసాధకు లవుతారు. 134. మనఅశక్తత దుఃఖాన్నితెచ్చి పెడుతూఉంటే, పరమేశ్వరునిఅనుగ్రహం సుఖాన్నిప్రసాదిస్తూ ఉంటుంది. అనర్థాలను విడిచి పెట్టిపరమార్థాన్ని ఆశ్రయిస్తే బ్రతుకుదివ్యంగా శోభిస్తుంది. 135. బరువులను మోయడానికి గాడిదలు చాలు. విలువలు గ్రహించాలంటే బుద్ధిలో వెలుగు ఉండాలి. బుద్ధిదీపం దివ్యంగా ప్రకాశించే వారే ప్రపంచంలో విలువైన వారు. 136. ఉల్లికి అలవాటుపడిన లోకానికి మల్లెలసౌరభం పట్టదు;గిట్టదు. మురికిగుంటలో ఈదులాడేమనసుకి మానససరోవర జలాలు రుచించవు. మోహంలో కూరుకుపోయిన మనుషులకు మోక్షాసక్తి కలగదు. 137. ఉండరానిది ఉన్నంత కాలం ఉన్నతి సాధ్యంకాదు. సృష్టిలోదృష్టిని సారించేవానికన్నా, దృష్టిలోని సృష్టిని సవరించుకున్నవాడే పుష్టిని, సంతుష్టిని పొందుతాడు. కష్టాలను అధిగమిస్తాడు. 138. ఏ క్షణాన గాలం నీటిలోప్రవేశిస్తుందో తెలియదు. ప్రవేశించిన క్షణాన చేపకు ఆయువు తీరినట్లే. ఏ క్షణాన కాలుడు మనపై కాలు మోపుతాడో అర్థం కాదు. మృత్యుంజయుని ఆశ్రయిస్తే, మృత్యువును దాటవచ్చు.ఆలోచించు. 139. ఆసక్తి ఉన్న చోట అందంఉంటుంది. అందం ఉన్నచోటికి మనస్సు ఆకర్షింప బడుతుంది. వాస్తవానికి ఆసక్తిఅనేది ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. మనస్సులో అందంఉంటే మహిమపై ఆసక్తి ఉంటుంది. మనస్సులో అందంలోపిస్తే, మహియే మనస్సుకు మహిమగా గోచరిస్తుంది. 140. కళ్ళు మూసిన వారందరూ నిద్రపోయే వారు కారు. అలాగే కళ్ళు తెరిచిఉన్న వారందరూ చూస్తున్నారని చెప్పలేము. మనసు మూత పడితేనే ధ్యానం. బ్రహ్మాత్మదర్శనమే జ్ఞానం. 141. ప్రపంచాన్ని గూర్చి అతిగాఆలోచించి నంతకాలము మనసుపై మనకు పట్టుచిక్కదు. రాగద్వేషాల మధ్య ఊగిసలాడినంతవరకు మనమనసుపై మనకు ఆధిపత్యం సిద్ధించదు. కాని, ఒక్కసత్యాన్ని సాధకులు గ్రహించాలి. తనను దూరంచేసిన వారికి దగ్గరకావడానికి మనస్సు ఎన్నడూఇష్ట పడదు. 142. దూరం ఎవరికైనాభారమే. దూరం ఉన్నప్పు డేసంబంధం. అందుకనే సంబంధాలన్నీ భారాలే అవుతాయి. బాధలనే సృష్టిస్తాయి. 143. ఉప్మాతిని ఉదరం ఊరకుంటుంది. ఉప్పు సరిపో లేదని నాలుకఊరంతా ఏకంచేస్తుంది. ఆహారంవిషయంలో అవసరమున్న ఉదరంకన్నా, నానారుచులకు అలవాటుపడిన నాలుకేప్రమాదకరం. 144. దేహాలు పుడుతాయి. పుట్టినవిపెరుగుతాయి. పెరిగినవి తరుగుతాయి. తరిగినవిఒరుగుతాయి. ఒరిగినవికరుగు తాయి. చంచలవస్తువులు, చపలహృదయాలు తప్ప ఏమున్నాయి ఈ ప్రపంచంలో? 145. కొంత కాలం క్రితం లేని మనం మరి కొంతకాలం కొనసాగితే ఉండబోము. ఈమధ్యలో ఏమిసాధించినట్లు? దూరమైన వాటినిమరువలేక చేరువైనవాటిని నిలుపుకోలేక సతమతమవుతున్నాము. ఆరిపోయేదీపం ఎంతకాలం ఉంటుందంటే ఏమిచెప్పగలం? దీపమున్నప్పుడే ఇల్లుచక్కబెట్టుకోవాలి అనేసలహా ఇవ్వగలం అంతే. 146. వృత్తిశూన్యతలో ఏముంది? శూన్యంతప్ప! వృత్తిమూలంలో స్వరూపాన్నిదర్శిస్తేనే పూర్ణఫలం. 147. పుస్తకాలలో ఉన్నజ్ఞానము, పరులవద్ద దాచినధనము నిరర్థకాలే నిరుపయోగాలే. అవసరం ఏర్పడినపుడు అవిఉపకరించవు. మస్తకములోని జ్ఞానము, హస్తగతమైన ధనము - ఇవే అవసరాలలో రక్షిస్తాయి. 148. అనంతాత్మను అమితంగా ప్రేమించడం వల్లనే ఈ ప్రపంచంలో ఎన్నిటినో ప్రేమించడం జరుగుతూ ఉంది. అనంతాత్మ ఒక్కటి ప్రియం కావడం చేత, విశ్వంలో ఎన్నెన్నో ప్రేమింప బడుతున్నాయి. ఎందరెందరో ప్రియంగా తెలుస్తున్నారు. 149. ప్రవాహం నదీ జలాలను సముద్రానికి చేర్చినట్లు, కాలప్రవాహం బ్రతుకును వల్లకాటికి చేర్చుతుంది. కాల ప్రవాహంలో ఆశల దీపాలు ఆరి పోతాయి. బాంధవ్య నౌకలు ముక్కలై పోతాయి. కాలాన్ని వాడుకోవాలే గాని కాలంతో ఆడుకోకూడదు. వాడుక లోనే ఉంది వేడుక. 150. ఏ విత్తనం నాటుతామో ఆ చెట్టే వస్తుంది. మనిషి ఎలా ఆలోచిస్తాడో అలాగే తయారవుతాడు. ధ్వనిని బట్టే ప్రతిధ్వని. ఇతరులకు మనం ఏది ఇస్తామో అదే మనకు తిరిగి ప్రాప్తిస్తుంది.

Comments

Popular posts from this blog

15- 9th page

18-19