ఎక్కడ మనస్సు

ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మానవులు తలలెత్తుకొని తిరుగగలరో ఎక్కడ జ్ఞానము స్వేచ్ఛగా మనగలుగుతుందో ఎక్కడ సంకుచిత సంసారపు కర్కశ కుడ్యాల మధ్య ప్రపంచం ముక్కలై విడిపోలేదో ఎక్కడ సత్య గహ్వరము నుండి పలుకులు పెల్లుబుకుతాయో ఎక్కడ అలుపు నెరుగని శ్రమ పరిపూర్ణత వైపు చేతులు చాస్తుందో ఎక్కడ మృత ఆచారపు టెడారిలో నిర్మలమైన జ్ఞాన ప్రవాహము ఇంకిపోదో ఎక్కడ మనసు సదా విశాల భావాలలోకి, వినూత్న కార్యాలలోకి నీచే నడుపబడుతుందో ఆ ముక్తిధామానికి, నా తండ్రీ, నా దేశాన్ని మేలుకొలుపు.

Comments

Popular posts from this blog

15- 9th page

మంచిమాటలు

18-19