ప్రకృతి అనంత శక్తి ~ తుమ్మ జనార్దన్...జ్ఞాన్...
ప్రకృతి అనంత శక్తి
~ తుమ్మ జనార్దన్ [జ్ఞాన్]
ప్రకృతి కరుణిస్తే చల్లని గాలి, నల్లని మేఘం
పచ్చదనం, ప్రశాంతత, ఆహ్లాదం, అన్నం, ఆనందం
ప్రకోపిస్తే కరాళ నృత్యం, జనం, జీవనం అస్తవ్యస్తం
మరణ మృదంగం, మానవ మనుగడ అసాధ్యం, మృగ్యం
ప్రకృతి శక్తి స్వరూపిణి, అదుపు చేయలేని అనంత శక్తి
కొండలు కదిలించగలదు, మానవ నిర్మితాలు తుడిచిపెట్టగలదు
ఊర్లను ఊడ్చేయగలదు, ఆనవాళ్ళు చెరిపేయగలదు
ఎదురులేక ఏగగలదు, జీవశ్చవాలుగా పూడ్చేయగలదు
ప్రకృతితో పరాచకం ప్రపంచ జీవన హననం
పంచభూతాల ప్రకోపం ప్రపంచానికి శాపం
జీవన క్రాంతికి విఘాతం, విశ్వ విధ్వంసం
దానితో మమేకం, హరిత భరితం, నిత్యానందం
మానవ జీవితం ప్రకృతి దయా దాక్షిణ్యం
అనంత శక్తికి మోకరిల్లడం అందరికీ క్షేమం
ప్రకృతిని ప్రేమిస్తే ఆనందం మన సొంతం
ప్రకృతి పరిరక్షణ అందరి తక్షణ కర్తవ్యం.
అనంత శక్తిని ఆరాధనతోనే మెప్పించాలి
అవతార సృష్టిని అభిమానంతో ఆదరించాలి
అందరి ప్రకృతి ఆదరణతోనే విశ్వం విఖ్యాతం
ఆదిశక్తి అనుగ్రహం ప్రత్యేకం, ప్రస్ఫుటం, ప్రశాంతం
Comments
Post a Comment