విశాలాంధ్ర పేరుతో ఉరి ఒత్తిడితో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు
వీర తెలంగాణ-2 - ప్రతిపక్షం విశాలాంధ్ర పేరుతో ఉరి ఒత్తిడితో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు *పెద్దమనుషుల ఒప్పందానికి తూట్లు *తెలంగాణ ప్రాంత ఉద్యోగాలకు ఎసరు! *ఇక్కడ విద్యావంతులు లేరని దుష్ప్రచారం *చట్టబద్ధంగా 'నాన్ ముల్కీల నియామకాలు మండిపడిన స్థానిక విద్యార్థులు. చిటుకుల మైసారెడ్డి, కత్తుల లక్ష్మారెడ్డి, ప్రతిపక్షం ప్రత్యేక ప్రతినిధులు నిజానికి ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి ఒకరోజు ముందే హైదరాబాదు రాజధానిగా విశాలాంధ్ర రాష్ట్రం వీలైనంత త్వరలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ నీలం సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సర్వసభ్య సమావేశంలో తీర్మానిం చారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో విశాలాంధ్ర నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ప్రాంతీయ భాషల ప్రాముఖ్యం పెరగడంతో, భాషా ప్రాతిపదికన హైద రాబాద్ రాష్ట్రంలోని తెలుగు భాష మాట్లాడే తెలంగా ణతో కలిపి హైదరాబాదు రాజధానిగా విశాలాంధ్ర ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరిగింది. కేంద్రంపై ఒత్తిడి పెరగడంతో 1953 డిసెంబర్ 29వ తేదీన అప్పటి ఒరిస్సా గవర్నర్ సయ్యద్ ఫజల్ అలీ చైర్మన్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లో సభ్యుడిగా ఉన్న హృదయ నాథ్ కుంజ్రూ, ఈజిప్టులో భారత రాయబారిగా పని చేస్త...