25 యేండ్ల తెలంగాణ - ఉద్యమాల పురిటి గడ్డ

ప్రతిపక్షం వీర తెలంగాణ - 1 25 యేండ్ల తెలంగాణ - ఉద్యమాల పురిటి గడ్డ ప్రతిపక్షం ప్రత్యేక ప్రతినిధులు ****************************** *నిలువెత్తు ఆత్మగౌరవ పతాక * నిజాము పాలన నుంచి విలీనం దాక *'ఆంధ్ర' నుంచి విశాలాంధ్ర వరకు *పోరుబాటే నడిచిన వీర తెలంగాణ *నిప్పుల కుంపటి నెత్తిన మోసిన వీణ 'కదనాన శత్రువుల కుత్తుకల నవలీల నుత్తరించిన బలోన్మత్తులేలిన భూమి ధీరులకు మొగసాలరా, తెలగాణ వీరులకు కాణాచిరా !! కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితిని 2001 ఏప్రిల్ 27న స్థాపించారు. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా సాధించడమే పార్టీ ఏకైక లక్ష్యం. తెలంగాణ ఆకాంక్షలను నిజం చేయాలనే రాజీలేని స్ఫూర్తితో, తెలంగాణ రాష్ట్ర హోదా సాధించడానికి నిరంతర ఉద్యమాన్ని నిర్వహించడంలో పార్టీ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రపంచంలోనే అతి పొడవైన ప్రజా ఉద్యమాలలో ఒకటి. 1950 దశకం ప్రారంభంలో ప్రారంభమైన ఉద్యమం ఆరు దశాబ్దాల పోరాటం తరువాత 2001లో కే ప్రారంభమైన ఉద్యమం ఉదృతంగా సాగి పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా ఫిబ్రవరి 2014 నాటికి దాని లక్ష్యానికి చేరుకుంది. చినుకులా మొదలై, జడివానలా కురిసి, ఏరులై పారి, ఉప్పెనై ఎగిసి తన గమ్యాన్ని ముద్దాడిన తెలంగాణ (భారత) రాష్ట్ర సమితి తన 25 యేండ్ల ప్రస్థానాన్ని ఈ నెల 27న రజితోత్సవ పండుగ జరుపుకుంటున్నది. ఈ శుభ తరుణంలో తెలంగాణ పోరును, ఉద్యమ హోరును ఓసారి మననం చేసుకుందాం. ….. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమితిని 2001 ఏప్రిల్ 27న స్థాపించారు.తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా సాధించడమే పార్టీ ఏకైక లక్ష్యం. తెలంగాణ ఆకాంక్షలను నిజం చేయాలనే రాజీలేని స్ఫూర్తితో, తెలంగాణ రాష్ట్ర హోదా సాధించడానికి నిరంతర ఉద్యమాన్ని నిర్వహించడంలో పార్టీ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రపంచంలోనే అతి పొడవైన ప్రజా ఉద్యమాలలో ఒకటి. 1950 దశకం ప్రారంభంలో ప్రారంభమైన ఉద్యమం ఆరు దశాబ్దాల పోరాటం తరువాత 2001లోకే ప్రారంభమైన ఉద్యమం ఉదృతంగా సాగి పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా ఫిబ్రవరి 2014 నాటికి దాని లక్ష్యానికి చేరుకుంది. చినుకులా మొదలై, జడివానలా కురిసి, ఏరులై పారి, ఉప్పెనై ఎగిసి తన గమ్యాన్ని ముద్దాడిన తెలంగాణ భారత రాష్ట్ర సమితి తన 25 యేండ్ల ప్రస్థానాన్ని ఈ నెల 27న రజితోత్సవ పండుగ జరుపుకుంటున్నది. ఈ శుభ తరుణంలో తెలంగాణ పోరును, ఉద్యమహోరును ఓసారి మననం చేసుకుందాం. స్వతంత్ర రాజ్యం నుంచి హైదరాబాద్ రాష్ట్రం దాకా భారత స్వాతంత్రోద్యమానికి తలొగ్గిన బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి అంగీకరించింది. 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశంలో అధికార బదిలీ జరుగుతుందని 1947 జూన్ మూడున బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగ ప్రకటించింది. ఆ సమయానికి తెలంగాణ నిజాంసంస్థానంలో భాగంగా ఉండేది. స్వాతంత్య్రం ఇచ్చేముందు బ్రిటిష్ పాలకులు హైదరాబాదు సంస్థానం భారతదేశంలో కానీ పాకిస్తాన్ లో గాని విలీనం కావడానికి లేదా స్వతంత్రంగా కొనసాగడానికి స్వేచ్ఛను ఇచ్చారు. దీంతో 1947 జూన్ 11వ తేదీన హైదరాబాదు రాజ్యం స్వతంత్రంగా ఉంటుందని నిజాం ప్రభువు ఒక ఫర్మానా జారీ చేశారు. హైదరాబాద్ .. రాజ్యం 1947 ఆగస్టు 15న స్వతంత్ర సార్వభౌమాధికారాన్ని పొందుతుందని ఫర్మానాలో పేర్కొన్నారు. 1947 ఆగస్టు 27 వ తేదీన హైదరాబాద్ స్వతంత్ర సార్వభౌమాధికార దేశమని ప్రకటించారు. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ నిజాం ఫర్మానాను వ్యతిరేకించి 'జాయిన్ ఇండియా' ఉద్యమాన్ని ప్రారంభించింది. ఇటు కాశీం రజ్వీ నాయకత్వంలోని మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 'ఆజాద్ హైదరాబాద్' నినాదంతో ఉద్యమించింది. ఈ ఉద్యమాలు, నిరసనలతో హైదరాబాద్ రాజ్య ప్రతినిధులు, భారత ప్రభుత్వ ప్రతినిధులతో 1947 అక్టోబర్ 11 నుండి 22 వరకు ఢిల్లీలో చర్చలు జరిపారు. ఫలితంగా నిజాం ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యథాతథ ఒడంబడికను ఆమోదించింది. దీనికి నిజాం తన అంగీకారాన్ని 1947 అక్టోబర్ 25వ తేదీన మౌఖికంగా తెలిపాడు. చివరకు 1947 నవంబర్ 29వ తేదీన నిజాం యథాతథ ఒప్పందంపై సంతకం చేశారు. యథాతథ ఒప్పందాన్ని ఇరువర్గాలు ఉల్లంఘించాయి. కాశీం రజ్వీ ఆందోళన దీంతో కాశీం రజ్వీ అనుచరులు, రజాకార్లు యథాతథ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. 1946-51 మధ్యకాలంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. దీంతో హైదరాబాదు రాజ్యంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి. రజాకార్ల దుశ్చర్యల నుండి హైదరాబాదు రాజ్యాన్ని కాపాడే నెపంతో 1948 సెప్టెంబర్ 13న భారత ప్రభుత్వం 'ఆపరేషన్ పోలో' పేరిట నిజాంరాజ్యంకి సైన్యాలను పంపింది. హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో అంతర్భాగమేనని మిలిటరీదాడి భారత అంతరంగిక విషయమని బయట ప్రపంచానికి చాటడానికి అప్పటి గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి సూచనతో “ఆపరేషన్ పోలో”ను భారత ప్రభుత్వం పోలీస్ చర్య అని పిలిచింది. పోలీస్ చర్య ఫలితంగా 1948 సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమై హైదరాబాదు రాష్ట్రంగా కొనసాగింది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు స్వాతంత్ర్యానికి పూర్వం కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. అపుడు ఆంధ్ర ప్రాంతం ఉద్యోగాలలో ఎక్కువగా తమిళులకు అవకాశం దక్కింది. తమిళ ప్రాంతాలతో పోలిస్తే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నత విద్యావకాశాలు లేకపోవడంతో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ముందుకు వచ్చింది. గుంటూరు పట్టణంలో సబ్ జడ్జిగా ఉన్న తమిళుడు తన గ్రామమైన కుంభకోణం నుండి మరో తమిళుడిని పిలిచి 1911 సెప్టెంబర్ లో కోర్టులో ఖాళీగా ఉన్న దఫేదారు ఉద్యోగానికి ఎంపిక చేశారు. తెలుగువారు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారికి ఇవ్వలేదు. దీంతో గుంటూరు యువజన సాహితి సమితి తమిళుల ఆధిపత్యాన్ని ప్రశ్నించి ఆంధ్రరాష్ట్ర ఆకాంక్షను తెరపైకి తెచ్చింది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చేయాలని డిమాండ్ క్రమంగా పెరిగింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చేయాలని కోరుతూ 1952 అక్టోబర్ 19వ తేదీన మద్రాసు నగరంలోని బులుసు సాంబమూర్తి ఇంటిలో పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష ప్రారంభించారు. దీంతో కేంద్రప్రభుత్వం మద్రాస్ రాష్ట్రంలోని తమిళులు, తెలుగువారితో చర్చలు జరిపింది. ఈ చర్చలలో ఆంధ్ర రాష్ట్ర నాయకులు మద్రాస్ తో కూడిన ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం పట్టుబట్టారు. దీనికి తమిళ నాయకులు ఒప్పుకోలేదు. అప్పటికే అటు, పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష 58 రోజులపాటు కొనసాగింది. 1952. డిసెంబర్ 15వ తేదీ అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు మరణించారు. పొట్టిశ్రీరాములు మరణానంతం ఆంధ్ర ప్రాంతంలో ఆందోళనలు ఉదృతమయ్యాయి. దీంతో మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి భారత ప్రభు త్వం నిర్ణయించిందని ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ 1952 డిసెంబర్ 19వ తేదీన ప్రకటించారు. విభజన సమస్యల పరిష్కారానికి రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కైలాసనాథ్ వాంఛూ ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదిక మేరకు 1953 జూలై 27న మద్రాస్ రాష్ట్ర శాసనసభ ఆంధ్ర రాష్ట్ర బిల్లును ఆమోదించింది. 1953 ఆగస్టు 28 వ తేదీన లోకసభ సెప్టెంబర్ 8వ తేదీన రాజ్యసభ ఆంధ్ర రాష్ట్ర బిల్లును ఆమోదించాయి. దీంతో 1953 అక్టోబర్ 1 వ తేదీన కర్నూలు తాత్కాలిక రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. (ఇంకా ఉంది)

Comments

Popular posts from this blog

మంచిమాటలు

మంచిమాటలు

15- 9th page