మీ తండ్లాట నాకు తెలుసు..వ్యాసకర్త:చిటుకుల మైసారెడ్డి. ప్రతిపక్షం ప్రత్యేక ప్రతినిధి.. ప్రతిపక్షం పత్రిక

 ప్రతిపక్షం పత్రిక 

మీ తండ్లాట నాకు తెలుసు

వ్యాసకర్త:చిటుకుల మైసారెడ్డి. ప్రతిపక్షం ప్రత్యేక ప్రతినిధి

ప్రభుత్వ అసమర్థత మూలంగా రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ దుస్థితిపై కేసీఆర్ ఆవేదన

వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుతో దేశ ప్రగతికి రాష్ట్ర ఆర్థిక,

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలుగా పరిఢవిల్లిన తెలంగాణ పల్లెలు నేడు కనీస

ఆదరణ లేక కునారిల్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాలలో పాలన

కుంటుపడి పోయిందన్నారు. కనీస మెయింటెనెన్స్, డీజిల్ లేక ట్రాక్టర్లు మూలకు

పడ్డాయని, సఫాయి కార్మికులకు జీతాలు లేక పారిశుధ్యం పడకేసిందని, అన్నీ

కష్టాలేనని పార్టీ నేతలు అధినేతకు వివరించారు. అధికారం కోసమే అలవిగాని

హామీలిచ్చి, కనిపించిన దేవుని మీదల్లా వొట్లు పెట్టి బూటకపు గ్యారెంటీలతో ప్రజలను

నమ్మించిన కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలోకి వచ్చి ఏణ్నర్ధం గడిచినా ఏమీ చేయకపోగా,

చేస్తున్నట్టు మభ్యపెడుతుండడంతో ప్రజలు ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు.

మీకున్న ఆవేదన ఎవరికీ ఉండదు తెలంగాణ బాగోగులు చూసే బిడ్డలు మీరు

*రాష్ట్ర సాధనకు యేండ్ల పాటు పోరు సలిపిండ్రు

*మీ కృషితో, త్యాగంతో జనంలో చైతన్యం నింపిండ్రు

*మన ప్రజల గురించి ఆలోచించేది బీఆర్ఎస్ పార్టీయే

*బీఆర్ఎస్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచింది.

*ఏం కోల్పోయారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు

*పాలేవో, నీల్లేవో వారికి ఇప్పుడు స్పష్టంగా తెలిసింది.

*రజతోత్సం సన్నాహక భేటీలలో శ్రేణులతో అధినేత కేసీఆర్

*సాగు, తాగు నీరు లేక జనం, రైతులు అవస్థ పడుతున్నారు.

*అధినేతకు విన్నవించిన పార్టీ నేతలు, కార్యకర్తలు

*నేటితో ముగిసిన వారం రోజుల సన్నాహక సమావేశాలు

హైదరాబాద్, ఏప్రిల్ 5: తెలంగాణ బాగోగుల పట్ల బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు ఉన్నంత ఆవేదన మరే ఇతర పార్టీకి ఉండదని పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. మన ప్రజల సంక్షేమం అభివృద్ధి గురించి అహర్నిశలు కృషి చేసిన ఉద్యమ స్పూర్తి బీఆర్ఎస్ పార్టీ సొంతమని పునరుద్ఘాటించారు. అనేక యేండ్లు పోరాటాలు చేసి, నిరాశానిస్పృహలో కూరుకుపోయిన తెలంగాణ సమాజానికి స్వరాష్ట్ర చైతన్యాన్ని నింపి, రాష్ట్ర సాధన కోసం శాంతియుత పంథాలో ప్రజా పోరాటాలు నడిపిన ఘన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలది, నాయకులదని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ సాధన అనంతరం ప్రజలిచ్చిన ఆదరణతో తొమ్మిదిన్నరేండ్లు రాష్ట్రాన్ని జన రంజకంగా పాలించి ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమ స్పూర్తితో సాగించిన బీఆర్ఎస్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. వ్యవసాయంతో పాటు సమస్త రంగాలు సర్వవృత్తులు సబ్బండ కులాలకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన సేవ మహోన్నతమైందన్నారు. అంతటి చిత్తశుద్దితో పట్టుదలతో ప్రజలే కేంద్రంగా వారి అభ్యున్నతే ధ్యేయంగా పనిచేయడం ఒక్క బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమన్నారు. తాము ఏమి కోల్పోయామో, యేడాదిన్నర కాంగ్రెస్ పార్టీ పాలన ద్వారా ప్రజల అనుభవంలోకి వచ్చిందన్నారు. ఘనంగా రజతోత్సవ సభ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలకు చేరుకున్న నేపథ్యంలో ఈ నెల 27 న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను నిర్వహించాలని అధినేత ఇప్పటికే నిర్ణయించి, ఆ దిశగా చర్యలను ప్రారంభించినన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఆయా జిల్లాల పార్టీ ముఖ్యనేతలతో గత వారం రోజులుగా సన్నాహక సమావేశాలను కేసీఆర్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వరంగల్, నిజామాబాద్, మెదక్,కరీంనగర్, అదిలాబాద్, హైద్రాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ముఖ్యనేతలతో సన్నాహక సమావేశాలు నిర్వహించి తదనుగుణంగా దిశా నిర్దేశం చేశారు. శనివారంనాడు ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలకు చెందిన అధ్యక్షులు, పార్టీ ముఖ్యనేతలతో అధినేత సమావేశమయ్యారు. వరంగల్ జిల్లాలో జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన చర్యలను ఈ సందర్భంగా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎర్రవెల్లి నివాసంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ' రాజకీయ కోణం పక్కన పెడితే, తెలంగాణ ప్రజల పట్ల మీకుండే చిత్తశుద్ది మరెవరికీ వుండదు. 15 యేండ్లు రాష్ట్రం కోసం కొట్లాడిన బిడ్డలుగా, పదేండ్ల పాటు రాష్ట్ర ప్రగతి కోసం తండ్లాడిన బిడ్డలుగా మీకే ప్రజల సంక్షేమం పట్ల కడుపునొప్పి వుంటది' అని కేసీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణ అంటే, ఇతరులకు పొలిటికల్ గేమ్, మనకు తెలంగాణ అంటే ఒక టాస్క్' అని పునరుద్ఘాటించారు. నిత్యం ప్రజల నడుమనే వుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గత పదిహేను నెలల కాలం నుంచి ఎక్కడికక్కడ ప్రజా సమస్యల మీద శాంతియుతంగా పోరాడుతున్న కార్యకర్తలను పార్టీ నేతలను అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. రాష్ట్రంలో పరిస్థితుల గురించి రాష్ట్రంలో వ్యవసాయం, విద్యుత్ సరఫరా, సాగు నీటిసరఫరా, తాగు నీరు సహా మౌలిక వసతుల లభ్యత గురించి అధినేత ఆరా తీసారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వారి వారి నియోజక వర్గాల పరిధిలో ప్రజలు పడుతున్న బాధలు, కష్టాలు నష్టాల గురించి, రాష్ట్ర ప్రభుత్వ పని తీరు మీద ప్రజలలో రోజురోజుకూ పెల్లుబికుతున్న వ్యతిరేకత గురించి, ప్రజల మనోవేదనను వారం రోజులుగా నడుస్తున్న సమావేశాలలో అధినేతకు పార్టీ నేతలు వివరించారు. సాగునీటి కాల్వలలో కేసీఆర్ నీళ్లు రావడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారని నేతలు ప్రజల మనసులోని మాటను తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నడిఎండకాలంలో నిండుకుండల్లా మత్తడి దునికిన చెరువులు కుంటలు పశువులకు జీవాలకు కూడా నీళ్లు లేకుండా పూర్తిగా ఎండిపోయాయని వారన్నారు. ఇన్నాళ్లు పుష్కలంగా రెండించుల పైపు నిండా నీళ్లు పోసిన వ్యవసాయ బోర్లు ప్రస్తుతం ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందుతుందనే ఆశతో యాసంగి వరి నాటేసుకున్న రైతులు నీరందరక పొట్టకొచ్చిన వరి పొలాలను పశువుల మేతకు వదిలేసుకున్న దయనీయ పరిస్థితులన వారు వివరించారు.నాకు కూడా సమాచారం ఉంది తనకు ఈ అంశాలలో ఇప్పటికే సమాచారమందుతున్నదని, ప్రభుత్వ అసమర్థత మూలంగా రాష్ట్రంలో రైతులు వ్యవసాయ దుస్థితి పై అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుతో దేశప్రగతికి రాష్ట్ర ఆర్థిక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలుగా ఫరిఢవిల్లిన తెలంగాణ పల్లెలు నేడు కనీస ఆదరణలేక కునారిల్లుతున్నాయనే  విషయం పట్ల ఆందోళన వ్యక్తంచేశారు. గ్రామాలలో పాలన కుంటుపడిపోయిందన్నారు.కనీస మెయింటెనెన్స్ డీజిల్ లేక ట్రాక్టర్లు మూలకు పడ్డాయని, సఫాయి కార్మికులకు జీతాలు లేక పారిశుధ్యం పడకేసిందని పార్టీ నేతలు అధినేతకు వివరించారు. అధికారం కోసమే అలవిగాని హామీలిచ్చి, కనిపించిన దేవుని మీదల్లా వొట్లు పెట్టి బూటకపు గ్యారెంటీలతో ప్రజలను నమ్మించిన కాంగ్రేస్ పార్టీ, ప్రభుత్వంలోకి వచ్చి ఏన్నార్థం గడిచినా ఏమీ చేయకపోగా చేస్తున్నట్టు మభ్యపెడుతుండడంతో ప్రజలు ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు.


Comments

Popular posts from this blog

మంచిమాటలు

మంచిమాటలు

15- 9th page