kallem
25 ఏళ్ల యాత్ర....!!
అతను ఉద్యమ జ్వాలై
పరశురాముడిలా పట్టెడు సత్తా కలిగిన వాడు
పౌరుషంతో నిండిన ప్రతి మాట ఒక తుపాను
తెలంగాణ అని వినపడగానే
గొంతులో గర్వం, గుండెల్లో అగ్ని!
కేసిఆర్ పేరు పలికితే _
పల్లె బాట లో నడిచిన ఆశ
పట్టణ వీధుల్లో మెరుపులా చెలరేగిన మార్పు
తన జీవితాన్నే దీపంలా వెలిగించి
తెలంగాణ తల్లి ముస్తాబుచేసిన మహానాయకుడు!
అతని గళంతో, గుండెల్లో ధైర్యంతో
కాలాన్ని గెలిచిన రోజులు
ఆయన ఆరాటమే భాధ్యతై
ప్రజల ఆకాంక్షలకు మార్గం అయ్యింది!
రజతోత్సవ వేళ
గతాన్ని ఒకసారి నెమరు వేస్తూ
గర్వంగా నినాదించే సమయం ఇది
"ఇది మా తెలంగాణ! ఇది మా నాయకుడు!"
వీధి చివర చిచ్చుపెట్టిన మాటలకంటే
ఓ శాంత స్వరూపి చేసిన కార్యమే గొప్పది!
పార్టీకి 25 ఏళ్లు _
ప్రతి సంవత్సరమూ ఒక ఉద్యమ ఘట్టం!
నేడు పూలతో మాత్రమే కాదు
ప్రజల గుండెలోంచి పూసిన విశ్వాసంతో
అలంకరించిన రోజు!
ఆయన అడుగులు చరిత్ర
ఆయన ఊసే - ఒక జాతి ఊపిరి!
_ 20/4/2025
Kalvakuntla Taraka Rama Rao - KTR Kalvakuntla Kavitha Ram Kalvakuntla BRS Party
#25YearsOfBRS #KCR #చలోవరంగల్ #ఎక్కతుర్తి #27thApril
Comments
Post a Comment