25 ఏళ్ల యాత్ర

 25 ఏళ్ల యాత్ర....!!

అందరిని ఒక తాటిపైకి తెచ్చి

ఒక దారి మీద నడిపించడం

ఆయన కలలే మన నేటి నిజాలు

ఆయన సంకల్పమే మన సమృద్ధి మార్గం!

విచారాల్లోనూ, విపత్తుల్లోనూ

విడవని పోరాటమే ఆయుధం

ప్రజల పట్ల ప్రేమే ఆయువు

ఆదర్శమే అస్త్రం అయ్యింది!

ఓ సంకల్పమే శాసనం అయి

ఓ నాయకత్వం ఆశల దీపమై

అసాధ్యాన్ని సాధ్యం చేయగల

ఆ వృధ్ధి కర్త మాకు దారిదీపం!

సామాన్యుని స్వప్నాలను గౌరవించి

ఆత్మ గౌరవంగా జీవించడం కోసం 

తెలంగాణ పతాకాన్ని ఎగరేసిన

తలవంచని నాయకుడే ఆయనే!

ఇప్పుడు మనం చూస్తున్న ఆ సంకల్పం

ఇంకా ఆగలేదు.... ఇంకా పరుగెడుతుంది

కేసిఆర్ తరంలో జన్మించడమంటే

నిజంగా అది ఓ పూర్వ జన్మ సుకృతమే!

____ 12/4/2025

యోధ
ఒక కొత్త పేజిని
ఈ చరిత్ర పుటల్లో నిలిపిన
ఈ మట్టి పరిమళం కేసిఆర్
మీరంటే తెలంగాణకి బరోసా
ఒక గొప్ప బాధ్యత!
నిరంతరం ఒక ప్రభంజనం
మీ జన్మం ఈ జాతికి ఒక వరం
మీరో నూతన ప్రపంచం!
@Kallem Naveen Reddy
జాతి ఆత్మగౌరవం
గౌరవింపబడటానికి
నిలువెత్తు సాక్ష్యం మీరే
తరాల తలరాతలు మార్చిన
కార్యసాధక
నీ ఋణం నీవెంటే ఉంటే తప్ప
తీర్చుకోలేనిది
అందుకే ఈ ప్రాణం ఉన్నంతవరకు
మీ ఆశయాల సాధనలో సాగుతూ
నేను మీకోసం!
Kallem Naveen Reddy

Comments

Popular posts from this blog

మంచిమాటలు

మంచిమాటలు

15- 9th page