విశాలాంధ్ర పేరుతో ఉరి ఒత్తిడితో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు
వీర తెలంగాణ-2 - ప్రతిపక్షం
విశాలాంధ్ర పేరుతో ఉరి ఒత్తిడితో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు
*పెద్దమనుషుల ఒప్పందానికి తూట్లు
*తెలంగాణ ప్రాంత ఉద్యోగాలకు ఎసరు!
*ఇక్కడ విద్యావంతులు లేరని దుష్ప్రచారం
*చట్టబద్ధంగా 'నాన్ ముల్కీల నియామకాలు
మండిపడిన స్థానిక విద్యార్థులు.
చిటుకుల మైసారెడ్డి, కత్తుల లక్ష్మారెడ్డి,
ప్రతిపక్షం ప్రత్యేక ప్రతినిధులు
నిజానికి ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి ఒకరోజు
ముందే హైదరాబాదు రాజధానిగా విశాలాంధ్ర
రాష్ట్రం వీలైనంత త్వరలో ఏర్పాటు చేయాలని కేంద్ర
ప్రభుత్వాన్ని కోరుతూ నీలం సంజీవరెడ్డి అధ్యక్షతన
జరిగిన కాంగ్రెస్ సర్వసభ్య సమావేశంలో తీర్మానిం
చారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో విశాలాంధ్ర
నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ప్రాంతీయ భాషల
ప్రాముఖ్యం పెరగడంతో, భాషా ప్రాతిపదికన హైద
రాబాద్ రాష్ట్రంలోని తెలుగు భాష మాట్లాడే తెలంగా
ణతో కలిపి హైదరాబాదు రాజధానిగా విశాలాంధ్ర
ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరిగింది. కేంద్రంపై
ఒత్తిడి పెరగడంతో 1953 డిసెంబర్ 29వ తేదీన
అప్పటి ఒరిస్సా గవర్నర్ సయ్యద్ ఫజల్ అలీ చైర్మన్
కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లో సభ్యుడిగా ఉన్న హృదయ
నాథ్ కుంజ్రూ, ఈజిప్టులో భారత రాయబారిగా పని
చేస్తున్న కవలం మాధవ ఫణిక్కర్ సభ్యులుగా రాష్ట్రాల
పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటుచేశారు. ఈ కమిషన్
రాష్ట్రమంతా తిరిగి ప్రజాభిప్రాయాన్ని స్వీకరించింది.
ప్రజాభిప్రాయం విశాలాంధ్రకు వ్యతిరేకంగా, ప్రత్యేక
తెలంగాణ అనుకూలంగా వచ్చింది. దీంతో
హైదరాబాద్ రాష్ట్రాన్ని యధాతథంగా కొనసాగించాలని,
ఐదేండ్ల తర్వాత జరిగే ఎన్నికల ద్వారా హైదరాబాదు
రాష్ట్రంలో ఏర్పాటయ్యే శాసనసభలో మూడింట రెండు
వంతుల మంది శాసనసభ్యులు అంగీకరిస్తేనే తెలంగా
ణను ఆంధ్రతో ఐక్యం చేయాలని, అలా కుదరకపోతే
హైదరాబాదు రాష్ట్రాన్ని అలాగే కొనసాగించాలని
ఫజల్ అలీ కమిషన్ నివేదిక సమర్పించింది. 1950
దశకంలో హైదరాబాదు రాష్ట్రంలోని ప్రజలలో ప్రారంభమైన
ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ
కమిషన్ తెలంగాణ రాష్ట్రాన్ని (అప్పుడు హైదరాబాద్
రాష్ట్రం అని పిలిచేవారు) సిఫార్సు చేయడానికి
దారితీసింది. ఈ నివేదికను 1955 సెప్టెంబర్ 30వ
తేదీన భారత ప్రభుత్వానికి సమర్పించగా 1955 అక్టోబర్
10వ తేదీన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రజల
ముందు ఉంచింది.
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నివేదిక ప్రత్యేక
తెలంగాణ రాష్ట్రం కోరుకున్నవారిని సంతృప్తిపరిస్తే
విశాలాంధ్ర కోరుకున్న వారిని అసంతృప్తికి అశాంతికి
గురిచేశాయి. 1955 నవంబర్ 25వ తేదీన ఫజల్ అలీ
కమిషన్ నివేదికపై హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో
చర్చకు పెట్టారు. విశాలాంధ్ర ఏర్పాటు చేస్తే మూకుమ్మడి
రాజీనామాకు సిద్ధమని తెలంగాణ నుండి ఎన్నికైన
14 మంది శాసనసభ్యులు సంయుక్త ప్రకటన చేశారు.
ఈ తీర్మానంపై డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 45 నిమిషాలు
ప్రసంగించారు. ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని వివరించారు.
తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంతో విలీనం చేయడం వల్ల
తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం కలగదని చెప్పారు.
ఐదు రోజుల చర్చ తర్వాత ఓటింగ్ లేకుండానే అసెంబ్లీ
వాయిదా పడింది. చర్చలో పాల్గొన్న 147 మంది సభ్యులలో
103 మంది విశాలాంధ్రను 29 మంది తెలంగాణ
ను సమర్థిస్తూ ప్రసంగించారు. చివరకు 1956 ఫిబ్రవరి
2వ తేదీన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నేతలు.
సమావేశమై ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికు
'పెద్దమనుషుల ఒప్పందం' అని పేరు. దీంతో హైదరాబాద్
రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో
విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం 'ది స్టేట్స్ రీ ఆర్గనైజేషన్
చట్టం 1956'ను ఆమోదించారు. ఈ చట్టాన్ని 1956
ఆగస్టు 31వ తేదీన భారత రాష్ట్రపతి ఆమోదించారు.
హైదరాబాదు రాజధానిగా 1956 నవంబర్ ఒకటవ
తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. సీమాంధ్ర
రాజకీయ నాయకుల తీవ్ర లాబీయింగ్ ఫలితంగా
తెలంగాణను బలవంతంగా ఆంధ్ర రాష్ట్రంలో విలీనం
చేసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పాటు చేశారు.
సంతకాల సిరా ఆరిపోకముందే
'పెద్దమనుషుల ఒప్పందం పై సంతకాల సిరా
ఆరిపోకముందే ఆంధ్ర నాయకులు అన్ని భద్రతా చర్యలను
విస్మరించి, తెలంగాణకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను
ఉల్లంఘించారు. బడ్జెట్ కేటాయింపులలో తెలంగాణ
వివక్షకు గురైంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన
ఉద్యోగాలు, విద్యా అవకాశాలను ఆంధ్రులు లాక్కున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి 12
సంవత్సరాల లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగుల
నియామకాలు, పదోన్నతులు, వేతనాల సవరణ,
బదిలీలు విధుల నిర్వహణ వంటి అంశాలలో ప్రభుత్వం
చట్టాలు, రాష్ట్రపతి ఉత్తర్వులు, రాజ్యాంగ నిబంధనలు,
సుప్రీంకోర్టు ఆదేశాల వంటి వాటిని పాటించకుండా
'పెద్దమనుషుల ఒప్పందానికి వారు తూట్లు పొడిచారు.
విచ్చలవిడిగా బోగస్ ముల్కీ సర్టిఫికెట్లను జారీ చేశారు.
తెలంగాణ విద్యావంతులకు ఈ ప్రాంతంలో అందుబాటులో
లేని విద్యార్హతలను ఉద్యోగ నియామకాలకు
అర్హతలుగా నిర్ణయించి, వారు లభించలేదనే సాకుతో
నాన్ ముల్కీలను చట్టబద్ధంగా తెలంగాణ ప్రాంత
ఉద్యోగాలలో నియమించారు. దీంతో ఈ ప్రాంతంలోని
నిరుద్యోగులలో అసంతృప్తి పెరిగి భవిష్యత్తులో తమకు
ఇక ఉద్యోగాలు లభించవేమోనని భయం, ఆందోళన
కలిగాయి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన పుష్కర కాలంలో
తెలంగాణవారికి ముఖ్యమంత్రి పదవికి కూడా అవకాశం
ఇవ్వలేదు. తెలంగాణ ప్రాంత ఆదాయాన్ని యథేచ్ఛగా
ఆంధ్ర ప్రాంతానికి తరలించి ఆ ప్రాంత అభివృద్ధి కోసం
ఖర్చు చేశారు. చట్టబద్ధంగా ఏర్పాటైన తెలంగాణ
ప్రాంతీయ మండలి అధికారాలను రాష్ట్రపతి ఉత్తర్వుల
ద్వారా కుదించారు.
(ఇంకా ఉంది)
Comments
Post a Comment