407 to 507
407. సుఖము డబ్బుతో కొనేది కాదు సుఖము బయట నుండి సమకూరేది కాదు సుఖము హృదయంలో ఊరాలి సుఖము ఆత్మస్థితిలో అనుభవించాలి 408. ఇతరులను - సుఖపెట్టుము అది - నీ సుఖముగా భావించుము ఇదియే - జీవన్ముక్తికి లక్షణమని గమనించుము 409. నైతిక సిద్ధాంతములు లేని రాజకీయములు దాన ధర్మము లేని ధనము సద్గుణము లేని విద్య మానవత్వము లేని విజ్ఞానము త్యాగము లేని కర్మ వ్యర్థములు 410. అడగకనే అందించెడి వాడు - అత్యుత్తముడు అడిగితే అందించే వాడు - ఉత్తముడు అడిగినా అందించని వాడు - అధముడు అపకారము చేసే వాడు - అధమాధముడు 411. నీ సొంతమైనదేదీ - నిన్ను వదలిపెట్టి వెళ్ళదు. దూరమయ్యేది ఏది - నీ సొంతం కాదు 412. సామాన్యులకు - ఆశలు ఉంటాయి. మహనీయులకు - మంచి ఆశయాలుంటాయి. 413. ఇనుమును వాడకపోతే- చిలుము పడుతుంది. నీటిని వాడకపోతే - పాచి పడుతుంది. ధనమును దానము చేయకపోతే - వృధా అవుతుంది. 414. తృప్తి ఉన్న వానికి కొంచెమున్నను - సౌభాగ్యమే తృప్తి లేని వానికి ఎంత ఉన్నా - దౌర్భాగ్యమే 415. మంచి విషయాలను లక్ష్యంతో సాధించు పనికిరాని విషయాలపై - నిర్లక్ష్యం వహించు 416. సత్పురుషులు సత్సంకల్పంతో - సత్ఫలితాలు పొందుతారు దుష్టులు దుస్సంకల్పంతో - దుఃఖమనుభవిస్తారు 417. మనిషిని నొప్పించే వాడు - మానవ రాక్షసుడు మనిషిని సంతోషపెట్టేవాడు - మహనీయులు 418. వాదనలతో గెలవలేనిది - ప్రేమతో గెలవవచ్చు మనిషికి అనుభవము - మంచి గుణము వైపు మళ్ళించు 419. మన సంపదలు - మనకు సంకెళ్ళు కారాదు. 450. నీటి నుండి బయటపడిన చేప - జీవించలేదు. దైవము నుండి బయటపడిన మనిషి - మనుగడ సాగించలేడు. 451. పొరపాటును పెంచుటకు - అవకాశమివ్వకండి పొరపాటును త్రుంచుటకు - వెనుకంజ వేయకండి. 452. అన్నిటి కంటే సులభం - పొరపాటు చేయడం అన్నిటి కంటే కష్టం - మంచి పనులు చేయడం కష్టమైనా, నష్టమైనా - మంచి పనులు మానకండి మంచి పనులే మానవత్వమని - మరవకండి 453. మందు కంటే - పథ్యం ముఖ్యం మందు సేవించు - పథ్యం ఆచరించు ప్రాణి కోటికి - సహకరించు ; సత్ఫలితం - సాధించు 454. లోకం నీవు ఏమి చెప్తున్నావో, ఏం చేస్తున్నావో, నీ స్వభావం ఏమిటో వెయ్యి కళ్ళతో పరిశీలిస్తుంది కావున మంచి మార్గాన్నే ప్రయాణించు మంచి పనులనే చేయుము జాగ్రత్త - తస్మాత్ జాగ్రత్త 455. ఏనుగు పాదంలో అన్ని పాదాలు ఇమిడినట్లు అహింస అనే గుణం ఉంటే అన్ని సద్గుణాలు నీలో ఉన్నట్లే, ఇమిడినట్లే 456. ఓర్పు - కవచంగా పని చేస్తుంది. కోపం - శత్రువులను సమకూరుస్తుంది మిత్రుడు - సిధ్ధౌషదంగా ఉపయోగపడతాడు దుర్జనుడు - సర్పము వలె కాటు వేస్తాడు ఖలునకు నిలువెల్లా విషము అంటాడు సుమతీ కారుడు కావున దుష్టునికి దూరంగా ఉండాలి. 457. తక్కువ సంపదలు కలిగి తక్కువ కోరికలు గలిగిన వ్యక్తి ఎక్కువ సంపదలు కలిగి ఎన్నో కోరికలో కూరుకుపోయే వాడి కంటే ధనవంతుడు. 458. డబ్బుతో పడక కొనగలము - నిద్ర కొనలేము డబ్బుతో వైద్యుని కొనగలము - ఆరోగ్యము కొనలేము డబ్బుతో కంటి అద్దమును కొనగలము - కంటి చూపును కొనలేము మందులను కొనగలము - ప్రాణమును కొనలేము గడియారమును కొనగలము - పోయిన సమయమును కొనలేము దేవుని పటమును కొనగలము - దేవుని అనుగ్రహము అసలు కొనలేము 459. నాలుగు రకాల జనాలను గూర్చి తెలుసుకుందాము ఉత్తమోత్తముడు - తన సుఖమును ఆశించక ఇతరులను సుఖపెట్టేవాడు. ఉత్తముడు - తాను సుఖమును అనుభవిస్తూ ఇతరుల సుఖమునకు సహకరించేవాడు అధముడు - తన సుఖము కొరకు ఇతరులకు కీడు చేయువాడు. అధమాధముడు - అనవసరంగా కీడు చేయువాడు. 460. ఆలోచించి - నిర్ణయించు; నిర్ణయించిందేదో - మంచిదే నిర్ణయించు 461. నీ మంచితనమే నీకు అండ ; నీ తప్పులే - నీకు గుదిబండ 462. కృతఘ్నత కౄరమృగము (చేసిన మేలు మరచువాడు) - -కృతజ్ఞత కలిగియుండుము 463. చెప్పింది చేయుట - చేసింది చెప్పుట - మహాత్ముల ప్రత్యేకత 464. మనస్సు మర్మం - తెలుసుకుంటే - మానవుడే - మాధవుడవుతాడు. 465. అందలం ఎక్కాలన్నా - అందరి కన్న మిన్న అవ్వాలన్నా కాలం కలసి రావాలి - అంతవరకు వేచి చూడాలి. 466. ఆరాటం పెరిగిందా - ఆందోళన పెరుగుతుంది. ఆందోళన పెరిగిందా - అలజడి రేగుతుంది. అలజడి రేగిందా - అగ్ని గోళమవుతుంది. అగ్ని గోళం అయ్యిందా - జన్మ వ్యర్ధమవుతుంది. 467. నలుగురి ఆనందం - నీ ఆనందంగా భావించు నలుగురితో నవ్వులు - పంచుకో - నలుగురిని మంచి చేసుకో ఆ నలుగురే చివరికి నీకు అవసరమని తెలుసుకో 468. పండితుడైనా, పామరుడైనా, పరిపాలకుడైనా పుట్టిన వాడు గిట్టక మానడు, మరచిపోని మంచిపని ఒకటైనా చేసి మరణించిన వాడే మానవుడు 469. పంచభూతాలకు అతీతుడు - పరమాత్మ పంచేద్రియాలకు దాసుడు - జీవాత్మ 470. అన్నీ వదలుట - వైరాగ్యం కాదు మనస్సులోని మాలిన్యాన్ని - వదులుటే నిజమైన వైరాగ్యం 471. గత జన్మలో - ఇతరులకు ఇచ్చినదే ఈ జన్మలో - మనము అనుభవించు చున్నాము 472. భగవంతుడు - గుడిలోనే వున్నాడనకు భగవంతుడు - గుడిలో కూడా వున్నాడనుము భగవంతుని - గుడికే పరిమితం చేయకు అంతటవున్న దేవుని - గుడిలో బంధించలేవని తెలుసుకో 473. తప్పు చేయుట - మానవ సహజం తప్పును ఒప్పుగ - ఒప్పించుట అసహజం తప్పును ఒప్పుగ - మార్చుటకు వంద తప్పులు చేయుట క్షమించరాని - పెద్ద తప్పు - చేసిన తప్పును - ఒప్పుకో పశ్చాత్తాపం - చెంది - చేసిన తప్పును - తిరిగి చేయకపోవడమే నిజమైన పశ్చాత్తాపమని - తెలుసుకో 474. మనకు తెలిసింది - కొంచము తెలియంది అనంతము - అని తెలుసుకో 475. తాను మింగేది - ఆహారం - తనను మింగేది - మృత్యువు మృత్యువు మింగకముందే - వచ్చిన పని పూర్తి చేసుకో మానవత్వానికి - సార్థకత చేకూర్చుకో 476 దైవాన్ని - నమ్మండి - దైవ ప్రార్థన - చేయండి దయాదాక్షిణ్యాలు - కలిగియుండండి దైవకృప - పొందండి ఎదుట అనలేని మాటలు - వెనక అనకండి 477. యజ్ఞం, యాగం, యోగం - చేయుట మంచిదే దానం, ధర్మం - జోడిస్తే మరీ మంచిది 478. ప్రతి ప్రశ్నకు - సమాధానం, ప్రతి సమస్యకు - పరిష్కారం చూపించేదే భగవద్గీత 479. శక్తివంతమయిన ఆయుధం - ఓర్పు ఓర్పుతోనే సర్వం - సమకూరును 480. సబ్బుతో ఒళ్ళు - శుభ్రపరచు సద్గుణాలతో - మనస్సు శుభ్రపరచు 481. లోకాన్ని జయించానని - విర్రవీగకు ఇంద్రియాలను జయించి - హీరోకమ్ము 482. చెడ్డపని చేయుటకు - సాహసించకు మంచిపని చేయుటకు - నీరసించకు 483. మేలు చేయుటకు - ముందుండు కీడు చేయుటకు - ఎక్కడా వుండకు 484. కొండంత కోరికలు వద్దు - వున్నంతలోనే ముద్దు 485. కోరికలను పెంచుతావు - అమలుకాకపోతే అరుస్తావు హద్దులేని కోరికలు వద్దు - హద్దులోనే వుంది ముద్దు 486. ప్రపంచాన్ని - భయపెట్టితివా! నీ భద్రతకే - అది ముప్పు 487. గొప్పవాడవని - నీకు నీవే డబ్బా కొట్టుకోకు లేని బిరుదులను - డబ్బు పెట్టి కొనబోకు 488. అంతా నీదే అని భ్రమించకు - ఏదీ నీది కాదని గ్రహించు వట్టి చేతులతోనే వచ్చావు - అదే విధంగానే పోతావు 499. పనికి మాలిన పనులు - కలుపు మొక్కల వంటివి కలుపు మొక్కలు - పంటకే ముప్పు వంటివి 500. రోజులోని 24 గంటలు - నీవే కావచ్చు అందులోని ఒక గంటనయినా - ఇతరుల సేవకు అర్పించు 501. సేవ చేసి - సేద తీర్చుకో నీస్థాయి ఏ స్థాయైనా - తల్లి స్థాయిని గౌరవించు తల్లిని ఆదరించు - నీ స్థాయిని అధిగమించు 502. నీకు లేనిది - ఇతరులకున్నదని అసూయ పడుకు పరుల ఆస్థి కొరకు - ప్రాకులాడకు నీ వద్ద ఉన్నదే - నీ వాటా అనుకో 503. అవసరాలు తగ్గించు - కోరికలు తొలగించు పండ్లను బట్టి - చెట్టును గుర్తించు గుణాన్ని బట్టి - గురువును నిర్ణయించు 504. సత్ ప్రవర్తనే - సహజమైన ప్రార్థన సద్గుణాలతో - పూజించు సత్ కార్యాలు - ఆచరించు సక్రమ మార్గంలో - జీవించు 505. గృహానికి - పునాది ముఖ్యం మానవునికి - సద్గుణాలు ముఖ్యం 506. ఎండమావుల నీరుతో - దప్పిక తీరదు అద్దములో ప్రతిబింబించిన పండ్లతో - ఆకలి తీరదు అమలు కాని వాగ్దానాలతో - అవసరాలు తీరవు 507. ఒకే దేవుడు - ఒకే జాతి అదియే - మానవ జాతి
Comments
Post a Comment