బిచ్చగాణ్ణి చూడగానే, 'నికృష్టుడా! ఎక్కడ చచ్చావు ఇంతకాలం? మళ్ళీ నీ శనిగొట్టు ముఖాన్ని చూపడానికి వచ్చావా?" అని రెచ్చిపోతూ, కోపాన్ని ఆపుకోలేక బలంగా కొడతాడు. ఆ దెబ్బకు బిచ్చగాని రూపంలో ఉన్న రాజు తూలి క్రిందపడి, మెల్లగా లేచి, తన దారిన తాను పోతాడు. అంతే గాని, ఏ మాత్రం దుఃఖించడు. విచారించడు. ఆ ప్రక్కనే ఒక నిత్యాన్నదాన సత్రం ఉంది. క్రొత్తగా ఉదారులు దానిని నెలకొల్పి ఉన్నారు. వారు గతంలో ఈ బిచ్చగాణ్ణి చూచి ఎరుగరు. వడ్డీ వ్యాపారి దుష్ప్రవర్తన నంతా చూచి బాధపడిన ఆ సత్రం యజమానులు అతనిని లోనికి తీసుకొని వెళ్ళి, ఓదార్పు మాటలు పలికి, భోజనం పెట్టిస్తారు. బట్టలు ఇస్తారు. కొంత డబ్బు కూడా ఇస్తారు. 'నాయనా! నిన్ను ఆ దుష్టుడు దుర్మార్గంగా బాధించాడు. అది మనస్సులో పెట్టుకోకు. వాడు అంతే. నువ్వు ఇక వెళ్ళు. నీకు ఇంకేమైనా డబ్బు అవసరమా? నిస్సంకోచంగా అడుగు, ఇస్తాము అంటారు. కానీ, రాజువద్దని తల ఊపి, తన దారిన తాను వెళ్ళి, అద్దెకు తీసుకున్న సత్రానికి చేరి, దుస్తులు మార్చుకొని, ప్రశాంతంగా కూర్చుంటాడు. ఏదో అనిర్వచనీయమైన దివ్యానందంలో ఓలలాడుతూ ఉంటాడు. జరిగిన ఈ సన్నివేశాలలో శుభాశుభాలు అతనిని అంటవు. అతడు శుభాశుభాలక...
Comments
Post a Comment