ఆ చేతి స్పర్శ చాలు Kallem Naveen Reddy
ఆ చేతి స్పర్శ చాలు Kallem Naveen Reddy
జీవితపు గాయాలన్నీ మాయమవుతాయి
కష్టాల రాత్రులు ఉదయమవుతాయి
ఆశలు పూలై మళ్లీ వికసిస్తాయి
ఆయన చూపే వెలుగు చాలు
మార్గం కనబడకున్నా దారి తెలుస్తుంది
విధి కఠినమైనా మనసుకు ధైర్యం ఇస్తుంది
ప్రతీ ఊపిరిలో కొత్త శక్తి నింపుతుంది
ఆయన మాట వినగానే గుండె ఉరకలేస్తుంది
ఆ స్వరం ప్రజల హృదయంలో నిండిపోయింది
ఆయన ఉన్న చోటే నమ్మకం పుడుతుంది
ఆయన నడిచిన దారిలో చరిత్ర నడుస్తుంది
ఆయన తరంలో పుట్టిన ఈ భాగ్యం
నాకు వంద జన్మల పుణ్యం
ఆయన ఆశీర్వాదమే నాకు బలం
ఆయన చింతనే నా అభ్యుదయ గమ్యం
నన్ను కన్న తల్లి ఇచ్చింది ప్రాణం
ఆయన చూపు ఇచ్చింది ప్రేరణ
ఆయన ఆశయాల్లోనే నా అభ్యుదయ భావాలు
ఆయన నడక నేర్పించిన దారిలో
ఆ ఆలోచనల పరంపరలో
ఆ దిశలో మన ఊపిరి కొనసాగాలి!
- Kallem Naveen Reddy
Comments
Post a Comment