ఆ యోధుడి పక్కన నడిచిన వాళ్ళు

 ఆ యోధుడి పక్కన నడిచిన వాళ్ళు

ఆయన ఆలోచనల్లో మమేకమైన వాళ్ళు

నాయకత్వం నేర్చుకున్న వాళ్ళు

పోరాటం అంటే ఏమిటో తెలిసిన వాళ్ళు

వేరే జెండా కింద నిలబడలేరు

ఒకవేళ ఉన్నా

గౌరవంగా ఉండలేరు

ఆయన చూపిన నడకే వారికి దారి

ఆయన మాటలే వారికి స్ఫూర్తి

వేరే పార్టీలో అడుగు పెట్టగానే

వేరే ఆలోచనల్లోకి వెళ్ళగానే

చెట్టు స్థాయిని తగ్గించలేరు

ఆ చెట్టు ఎంతో మందికి నీడను కల్పించింది

వ్యవస్థలో ఒక గౌరవాన్ని ఇచ్చింది

ఎందుకంటే అది కేవలం పార్టీ కాదు

ఒక పాఠశాల, ఒక తత్వం, ఒక ఉద్యమం!

అక్కడే వారు పుట్టారు

అక్కడే వారు ఎదిగారు

అక్కడి ఉద్యమమే వారి బలం

అక్కడి నడకనే వారి గౌరవం

వేరే వ్యవస్థలో నిలబడటమంటే

తమను తాము కోల్పోవడమే

సార్ ఇచ్చిన మార్గదర్శకత్వం

తెలంగాణకు శ్రీరామ రక్షగా ఉండాలి

మనం భాధ్యత కలిగిన వాళ్ళం

పెద్ద సారుకు బలం అవ్వాలి

ఏ రకంగా కూడా ఇబ్బంది కాకూడదు!

జై తెలంగాణ! ✊✊    జై కేసీఆర్!! ✊✊

- Kallem Naveen Reddy


Comments

Popular posts from this blog

మంచిమాటలు

మంచిమాటలు

15- 9th page