స్పందన

స్పందన 
ప్రేమమూర్తులు, జ్ఞానస్వరూపులైన,
పూజ్య గురుదేవులకు,
శతకోటి ప్రణామములు,  శ్రీ గురుభ్యోనమ,
ఓం నమో భగవతే వాసుదేవాయ. 
నా జీవితాన్ని ప్రభావితం చేసిన జ్ఞానత్రయాన్ని తెలియ చేయాలని ఈ లేఖ వ్రాస్తున్నాను. అవి (1) మీరు హైదరాబాద్ లో నిర్వహించిన 100 జ్ఞానయజ్ఞము (2) మీరు రచించిన 'చైతన్య భగవద్గీత (3) వరంగల్ సుందర సత్సంగ్ సదస్సు
(1) 100వ గీతా జ్ఞానయజ్ఞములో మీరు చేసిన అద్భుతమైన ప్రవచనములు నా జీవిత ఒరవడినే మార్చివేశాయి. జీవిత గమ్యాన్ని, మార్గాన్ని సుస్పష్టంగా నిర్దేశించాయి. కృతజ్ఞతా భావంతో శిరస్సు వంచి మీకు మరల మరల నమస్కరిస్తున్నాను. 
(2) మీ అమృతహస్తాల నుండి వెలువడిన చైతన్య భగవద్గీత 'వ్యామిశ్రేణ ఇవ 'వాక్కేన' ఆధ్యాత్మిక గందరగోళంతో ఉన్న స్థితి నుండి నన్ను ఒక స్పష్టమైన స్థాయికి చేర్చింది. జీవితంలో నిండు వెలుగులను నింపింది. గీతా హృదయాన్ని బుద్ధికి  పట్టించింది. 
వ్యాస, శంకరుల తరువాత ముముక్షు లోకానికి అంతగా సేవ లందించింది నా గురుదేవులు మాత్రమే అనే దానికి శాశ్వత సాక్ష్యం 'చైతన్య భగవద్గీ'  నా శ్రీకృష్ణుడు, నా సుందర గురుదేవులు వేరు వేరని భావించే నా భేదబుద్ధిని తొలగించి సమబుద్ధిని ప్రసాదించిన గ్రంథము 'చైతన్య భగవద్గీత' గురుదేవా! కృతజ్ఞతా భాష్పాలతో మీ పాదపద్మాలను అభిషేకిస్తున్నాను. 
(3) దయాసింధువులైన మీరు మీ అనుభవ పిండితార్థాన్ని వరంగల్ లో పన్నెందు ఆధ్యాత్మిక సందేశ మణుల రూపంలో ముముక్షువులకు ప్రేమతో అందించారు. ప్రపంచంలో తల్లిదండ్రులు, అమ్మమ్మ నాయనమ్మలు, తాతముత్తాతలు, సోదర బంధుమిత్రాదులు, తోటి సత్సంగ సహచరులు అందరి ప్రేమను కలిపి కలబోసినా, డిసెంబర్ 24వ తేదీ సాయంత్రం వరంగల్ సదస్సులో మీరు పంచిన ప్రేమలో సహస్రాంశం  అవుతుంది. మీరు ప్రసాదించిన మంత్ర రూపాలైన పన్నెండు విషయాలు వాస్తవానికి ముముక్షువులకు  బుద్ధి దీపాలు. 
"మీరు చేసిన అనుభవ జ్ఞానమణులు నన్ను గాలిలో తేలియాడేటట్లు వున్నాయి అసలు  నా పాదాలు భూమి మీద ఉన్నవా? లేవా? అనేది నిర్ధారించు కోవడానికి భూమిని నా కాలుతో ప్రత్యేకించి తాకవలసి వస్తోంది. కృతజ్ఞతతో పులకరించి పోతున్నాము.. 
-సుందర గురుదేవులకు పునః పునః ప్రణామములు 
గురుచరణధూలి...   శ్రీధర్ ...వివేకానందనగర్ సత్సంగ్ -హైదరాబాద్

Comments

Popular posts from this blog

మంచిమాటలు

మంచిమాటలు

15- 9th page