చైతన్య భగవద్ గీత
చైతన్య భగవద్ గీత 9 వ అధ్యాయము రాజ్యవిద్యా రాజాగుహ్య యోగము 22 వ శ్లోకము
అనన్యా శ్చిన్తయన్తో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహా మ్యహమ్ ॥
అర్జునా! నిత్యము నా కొరకు ప్రయత్నించే భక్తులు మరో ఆలోచన లేకుండా నన్నే చింతిస్తూ ఉంటారు. కనుకనే, వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను.
కర్మ ప్రవృత్తి - భక్తి ప్రపత్తి
వ్యాఖ్య
ఇహ పరాలలో కర్మ యొక్క స్వభావ స్వరూపాలను, కర్మ అందించే ఫలభోగాలను కొంత వరకు
మనము అర్థం చేసుకున్నాం. కర్మ అనేది - అది లౌకిక మైనా, వైదిక మైనా, అది అందించే ఫలం - అది ఇహ లోక సంబంధ మైనా, పరలోక సంబంధ మైనా అనిత్యమే నవి, విషయానుభవమే నని మనకు అర్థమై పోయింది. కర్మ నికృష్టమే గాక, జనన మరణాల మధ్య జీవుణ్ణి త్రిప్పుతూ ఉన్నందున అనర్ధ మని కూడా స్పష్టమైంది.
అలాగని కర్మలను గర్జించ నవసరం లేదు. కర్మలన్నీ దుఃఖభూయిష్టాలేనని, అనర్ధ దాయకాలేనని
భావించ నవసరం లేదు. మన చేతిలో ఉన్నవి కర్మలే. మనస్సులో ఉన్నవి సంకల్పాలే. అవన్నీ గనుక శోకమయమే అయితే ఇక మనం సుఖ పడలేము.
అవగాహన తోడైతే, అనిత్యాలను అధిగమించి అనంతంలో విహరించడానికి, పరిమితాలను దాటి
పరిపూర్ణం వైపు పయనించడానికి కర్మలు వాహనాలైతే, సంకల్పాలు ఇంధన మవుతాయి. అనుభవాలు రహదారులైతే, ఈశ్వరానుగ్రహం దారిదీపమవుతుంది.
Comments
Post a Comment