Posts

Showing posts from September, 2025

కలలను కరిగించే

కలలను కరిగించే కవితా ఉషస్సులో ప్రార్థననే ప్రాణవాయువుగా పొందిన ఓ కిరణం స్వామి సుందరచైతన్యానంద

నవ్విన పువ్వులు - స్వామి సుందర చైతన్యానంద

  నవ్విన పువ్వులు మధురమైన భావాలను సుమధురమైన పదజాలంలో తురిమి మృదుమధురమైన కవితా పల్లకీలో కూర్చోబెట్టి ఊరేగించేదే  కవిత్వమైతే, దానికి ముందు మాట రాసేందుకు కవిగా నేను ముందుకు రాలేదు. మీ ముందుకు రాలేను. కవిత్వ మనేది కేవలం సమదర్శనమే నని కవి ఏనాడైనా క్రాంతదర్శియే నని నిజాలను ప్రదర్శించే యత్నంలో ఋజువులను సృష్టించే ప్రయత్నంలో యోజనాలను దూరాలుగా, భారాలుగా భావించక ప్రయోజనాలనే భవ్యంగా, భావ్యంగా తలచి జననాడిని కుదిపి జీవనాడిని తెలిసి  జీవన స్రవంతి నిరాటంకంగా సాగేందుకు అవరోధాలను తొలగించి రేపటి ఆశకు తెరదించి నిన్నటి నిరాశకు సమాధి కట్టి. నేటిని మేటిగా నిలిపేందుకు సర్వాన్ని సర్వంలో కలిపేందుకు -  కవిత్వమొక సాధనమైతే, కవిగా నేను సాధకుణ్ణి సాధ్యాన్ని కూడా. అవలోకించే వారికి సుందర వనాన్ని అండ చేరే వారికి చైతన్య నిలయాన్ని ఆస్వాదించే వారికి ఆనందాలయాన్ని, ఈ వనంలో విరబూసిన వేదాంత సుమాలే చైతన్య స్వరాలు ఈ నిలయంలో విరజిమ్మిన విజ్ఞాన సౌరభాలే చైతన్య రాగాలు ఈ ఆలయంలో విరివిగ వితరణ చేయబడిన ప్రసాదాలే చైతన్య గానాలు. ఈ పాటల్లో మంచి చెడుల మర్మాలున్నాయి. ధర్మాధర్మాల సందడులున్నాయి. వివేకాన్ని పంచే అంగడులున్నాయ...

చైతన్య భగవద్ గీత

చైతన్య భగవద్ గీత 9 వ అధ్యాయము రాజ్యవిద్యా రాజాగుహ్య యోగము 22 వ శ్లోకము అనన్యా శ్చిన్తయన్తో మాం యే జనాః పర్యుపాసతే | తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహా మ్యహమ్ ॥ అర్జునా! నిత్యము నా కొరకు ప్రయత్నించే భక్తులు మరో ఆలోచన లేకుండా నన్నే చింతిస్తూ ఉంటారు. కనుకనే, వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను. కర్మ ప్రవృత్తి - భక్తి ప్రపత్తి వ్యాఖ్య ఇహ పరాలలో కర్మ యొక్క స్వభావ స్వరూపాలను, కర్మ అందించే ఫలభోగాలను కొంత వరకు మనము అర్థం చేసుకున్నాం. కర్మ అనేది - అది లౌకిక మైనా, వైదిక మైనా, అది అందించే ఫలం - అది ఇహ లోక సంబంధ మైనా, పరలోక సంబంధ మైనా అనిత్యమే నవి, విషయానుభవమే నని మనకు అర్థమై పోయింది. కర్మ నికృష్టమే గాక, జనన మరణాల మధ్య జీవుణ్ణి త్రిప్పుతూ ఉన్నందున అనర్ధ మని కూడా స్పష్టమైంది. అలాగని కర్మలను గర్జించ నవసరం లేదు. కర్మలన్నీ దుఃఖభూయిష్టాలేనని, అనర్ధ దాయకాలేనని భావించ నవసరం లేదు. మన చేతిలో ఉన్నవి కర్మలే. మనస్సులో ఉన్నవి సంకల్పాలే. అవన్నీ గనుక శోకమయమే అయితే ఇక మనం సుఖ పడలేము. అవగాహన తోడైతే, అనిత్యాలను అధిగమించి అనంతంలో విహరించడానికి, పరిమితాలను దాటి పరిపూర్ణం వైపు పయనించడానికి కర్మలు వాహనాలైతే, సంకల్పా...

బిడ్డ అన్నం తినగానే

బిడ్డ అన్నం తినగానే, రూపాయి బిళ్ళ తిరిగి ఇవ్వమని తండ్రి మారాం చేయడం ప్రారంభిస్తాడు. పిల్లవాడు ఇవ్వ నంటాడు. తండ్రి గద్దిస్తూ ఉంటాడు. బిడ్డ ఏడుస్తూ ఉంటాడు. ఎందుకండీ! బిడ్డను అలా ఏడిపిస్తారు? అని నివారించే ప్రయత్నం చేస్తుంది తల్లి. వాడు పారేసుకుంటాడు అంటాడు తండ్రి. మీరు కాస్త ఊరుకోండి. నాయనా! నువ్వు ఇవ్వొద్దులే. నీ చేతి లోనే ఉంచుకో. నేను జోల పాడతాను, నువ్వు నిద్రపో! అని పిల్లవాణ్ణి నిద్రబుచ్చుతుంది తల్లి. కొంత సేపటికి పిల్లవాడు నిద్ర పోతాడు. అంతే. చేతిలోని రూపాయి బిళ్ళ చేజారి క్రింద పడుతుంది. భార్య భర్తను పిలిచి, రండి! ఇదిగో మీ రూపాయి బిళ్ళ. తీసుకోండి! పడేసుకుంటాడు అంటూ పిల్లవాడికన్నా ఎక్కువగా గోల చేశారు. ఇష్టమైన దానిని ఎవరు పడేసుకుంటారు? పడేసే సమయం వచ్చి నప్పుడు ఎవరు ఉంచు కుంటారు? అంటుంది తల్లి. అడిగినా ఇవ్వని పిల్లవాడు నిద్ర లోకి జారుకోగానే రూపాయి బిళ్ళ దానంతటదే చేజారి పోయింది. భక్తులూ అంతే. అనన్య భక్తిలో మనస్సు తన్మయం చెందగానే, ప్రపంచం అప్రయత్నంగా మనస్సు నుండి జారి పోతుంది. అన్య చింతలు పారి పోతాయి. అదే అనన్య భక్తి. అన్యాశ్రయాణాం త్యాగః అనన్యతా - అన్య ఆశ్రయాలను విడిచి పెట్టి, పరమేశ్వరు...

స్పందన

స్పందన  ప్రేమమూర్తులు, జ్ఞానస్వరూపులైన, పూజ్య గురుదేవులకు, శతకోటి ప్రణామములు,  శ్రీ గురుభ్యోనమ, ఓం నమో భగవతే వాసుదేవాయ.  నా జీవితాన్ని ప్రభావితం చేసిన జ్ఞానత్రయాన్ని తెలియ చేయాలని ఈ లేఖ వ్రాస్తున్నాను. అవి (1) మీరు హైదరాబాద్ లో నిర్వహించిన 100 జ్ఞానయజ్ఞము (2) మీరు రచించిన 'చైతన్య భగవద్గీత (3) వరంగల్ సుందర సత్సంగ్ సదస్సు (1) 100వ గీతా జ్ఞానయజ్ఞములో మీరు చేసిన అద్భుతమైన ప్రవచనములు నా జీవిత ఒరవడినే మార్చివేశాయి. జీవిత గమ్యాన్ని, మార్గాన్ని సుస్పష్టంగా నిర్దేశించాయి. కృతజ్ఞతా భావంతో శిరస్సు వంచి మీకు మరల మరల నమస్కరిస్తున్నాను.  (2) మీ అమృతహస్తాల నుండి వెలువడిన చైతన్య భగవద్గీత 'వ్యామిశ్రేణ ఇవ 'వాక్కేన' ఆధ్యాత్మిక గందరగోళంతో ఉన్న స్థితి నుండి నన్ను ఒక స్పష్టమైన స్థాయికి చేర్చింది. జీవితంలో నిండు వెలుగులను నింపింది. గీతా హృదయాన్ని బుద్ధికి  పట్టించింది.  వ్యాస, శంకరుల తరువాత ముముక్షు లోకానికి అంతగా సేవ లందించింది నా గురుదేవులు మాత్రమే అనే దానికి శాశ్వత సాక్ష్యం 'చైతన్య భగవద్గీ'  నా శ్రీకృష్ణుడు, నా సుందర గురుదేవులు వేరు వేరని భావించే నా ...

sridhar babu

ఆచార్యులు - అవగాహన - శ్రీ జి. శ్రీధర్ బాబు హైదరాబాద్