మంచిమాటలు
161. ఆరాటం ఎక్కువైతే - ఆందోళన పెరుగుతుంది ఆందోళన పెరిగితే - ఆరోగ్యం తరుగుతుంది ఆరోగ్యం తరిగితే - ఆయుస్సు తగ్గుతుంది; ఆయుస్సు తగ్గితే - అసలుకే ముప్పు వస్తుంది; ఉన్న విషయం ఇది - ఆలోచించి నిర్ణయించుట నీ విధి. 162. ఆవేశం తగ్గించు - ఆలోచన పెంచు 163. కక్షను - కొనసాగించకు ; కరుణను - వదులుకోకు 164. మానవ శవాన్ని తాకితే - స్నానం చేయాలంటారు జంతువుల శవాన్ని మాత్రం తింటానంటారు; శవాలకు శ్మశానం వుందని - మరువకు నీ కడుపు శ్మశానం - కానివ్వకు; జీవకారుణ్యం గురించి - వివరిస్తానంటావు; జీవాలను మాత్రం - తింటానంటావు; మందు తింటానంటావు - పథ్యం ఆచరించనంటావు; మందు కంటే పథ్యమే ముఖ్యమని - తెలుసుకోమంటాను. 165. దురాచారుడే - దుష్టుడు;సదాచారుడే - సాధువు దురాచారమును- దులపండి; సదాచారమును - పొందండి 166. అహంకారము - వద్దు ; ఉపకారమే - ముద్దు 167. విశ్వమును - నమ్మకు ; విశ్వేశ్వరుని - నమ్ముము. 168. నీ బరువు - కాటాకు తెలుసు ; నీ తెలివి - అందరికి తెలుసు; నీ శక్తి - నీకే తెలుసు- నీ బలహీనత - అందరికి తెలుసు. 169. నీవు సమర్థుడవని - నీవే సర్టిఫికెట్టు ఇచ్చుకోకు - నీకు నీవే ఇచ్చుకున్న- సర్టిఫికెట్ విలువలేనిదని; తెలుసుక...
Comments
Post a Comment