అయిదేండ్లకోసారి కవితాగానం
అయిదేండ్లకోసారి
కవితాగానం
కోల్లు దినేటోల్లు పోయి గొర్లు దినేటోల్లొచ్చిరి
అయిదేండ్లకు కనిపిచ్చిరి ఐకుంటం జూపిచ్చిరి
బడి పెట్టిస్తామనిరి గుడి గట్టిస్తామనిరి
బడిసున్నా జుట్టిరి గుడికో నామం బెట్టిరి
కంకర రోడ్డేస్తమనిరి కరెంటు తెప్పిస్తమనిరి
అడ్డమైన పైస గుంజి బిడ్డల లగ్గాల్ జేసిరి
పజల రాజ్జె మనబట్టిరి పంచాయితిలని పెట్టిరి
పజల పేరు జెప్పుకొనీ కజానాలు కాజేసిరి
సబల మీద సబలుబెట్టి సదివిందూదర గొట్టిరి
సివారు దాటంగానే సెప్పింది వొదిలిపెట్టిరి
గాందిపేర 'జై' కొట్టిరి కల్లంటే 'చీ' కొట్టిరి
తెల్లార్లూ పెద్దారింట్ల నల్లసీస లొడగొట్టిరి
మా వూరు మాట్లాడింది DR C NARAYANA REDDY BOOK
తెలంగాణంలో నైజాం పాలన అంతరించి ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పుడు
కొందరు నాయకుల దోపిడిని కనిపెట్టిన గ్రామీణులు
Comments
Post a Comment