పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర

✳ పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 💥 కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపం 💥 కాంగ్రెస్ పార్టీ పాలన ఫ్రం ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైంది 💥 కాంగ్రెస్ పాలనలో జరిగిన పతనం నుంచి తెలంగాణ కోలుకోవడం అసాధ్యం 💥 ప్రజల పక్షాన కొట్లాడడమే ప్రస్తుత బాధ్యత 💥 బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం 💥 పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయి పాదయాత్రను నిర్వహిస్తా 💥 కేసీఆర్ గారు సంపూర్ణ అరోగ్యంతో ఉన్నారు.. పార్టీకీ మార్గదర్శనం చేస్తున్నారు 💥 పార్టీ నేతలపై వేధింపులు, అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై కఠిన చర్యలు 💥 రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి 💥 మా సోషల్ మీడియా వారియర్లు అద్భుతంగా పనిచేస్తున్నారు ® సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రజలతో కేటీఆర్ సంభాషణ పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను నిర్వహిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దీపావళి రోజు సామాజిక మాద్యమం ఎక్స్‌లో నెటిజన్లతో జరిగిన సంభాషణ కేటీఆర్ తెలిపారు. దేశంలోని అనేక పార్టీల నేతలు, ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, పార్టీలను బలోపేతం చేసేందుకు పార్టీ అధ్యక్షులు పాదయాత్రలు చేస్తున్నారు, మీరెప్పుడు చేస్తారని అడిగారు. దీనికి స్పందించిన కేటీఆర్ ఖచ్చితంగా తన పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సంభాషణలో కేటీఆర్ అనేక అంశాలపై తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయని కేటీఆర్ అన్నారు. అనేక అంశాలు రెండు పార్టీల నాయకులు కుమ్మక్కై పనిచేస్తున్న విషయం ప్రజలందరికీ అర్థమవుతుందని తెలిపారు ఇచ్చిన హామీలను తప్పుతున్న కాంగ్రెస్ లాంటి పార్టీలపైన చర్యలు తీసుకునేందుకు ప్రజలను పదే పదే మోసం చేయడానికి అరికట్టేందుకు బలమైన ఎన్నికల సంస్కరణలు అవసరమన్నారు మహారాష్ట్ర ఎన్నికల్లోను జాతీయ పార్టీలను ప్రజలు నమ్మవద్దని అక్కడి స్థానిక పార్టీలకు ఓటు వేయాలన్నారు తమిళనాడు విజయ్ దళపతి ప్రారంభించిన రాజకీయ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు రాజకీయపరమైన అంశాల పట్ల విభేదాలే తప్ప తెలుగుదేశం, వైఎస్సార్సీపీ అగ్ర నాయకులందరితో వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉన్నదన్నారు ప్రజలే సాధారణ వ్యక్తులను నేతలుగా తయారు చేస్తారని తన నమ్మకం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలంగా తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబం, తన స్నేహితులు, కుటుంబ సభ్యుల వల్లనే తనకు నిత్యం స్ఫూర్తి అందిస్తుందన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండే అవకాశం వలన మాకు నిబద్ధత కలిగిన, బలమైన నూతన నాయకత్వాన్ని తయారు చేసుకునే అవకాశం ఇచ్చింది. నిజం కన్నా పర్సెప్షన్, పీపుల్ మేనేజ్‌మెంట్‌ చాలా ముఖ్యమని గత ఎన్నికల ఓటమి మాకు నేర్పిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధపు హామీలు ప్రజల్లో అవాస్తవికమైన ఆశల్ని రేకెత్తించాయని, రెండుసార్లు వరుసగా గెలవడంతో యాంటీ ఇంకంబెన్సీ కూడా తమ ఓటమి విషయంలో కొంత ప్రభావం చూపింది. పార్టీ మారిన 10 మంది అసెంబ్లీ స్థానాలు ఉప ఎన్నికలు తప్పకుండా వస్తాయన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశం బీజేపీ చేస్తున్న మరొక జుమ్లా అయి ఉంటుందని, అయితే వారు తీసుకువచ్చే చట్టం ఎలాంటిదో చూడాల్సిన అవసరం ఉందన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇది అసాధ్యం అని తెలిపారు. గ్రూప్ వన్ అభ్యర్థుల తన పూర్తి మద్దతు ఉంటుందన్న కేటీఆర్, పార్టీ తరఫున వారికి అండగా ఉంటామన్నారు. యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకువస్తాం.

Comments

Popular posts from this blog

మంచిమాటలు

మంచిమాటలు

15- 9th page