Posts

సనాతన సౌరభాలు గ్రంధం నుండి

సనాతన సౌరభాలు గ్రంధం నుండి 1. మరణించిన తరువాత జీవుని స్థితి 2. పితృకర్మల గురించిన వివరణ మరణం తరువాత జీవాత్మ పరిస్థితి ఈ లోకంలో ప్రతీమనిషి శాశ్వతంగా ఉండిపోతాననే అనుకుంటాడు. పుట్టిన క్షణం నుండి ప్రతిక్షణము తన ఆయుషు తగ్గుతునే ఉంటుందని తెలియదు, వేసే ప్రతి అడుగు మృత్యువు వద్దకే అని తెలియదు. తనకు ఉన్నnఆయుర్దాయం ఎంతో తెలియదు. కుటుంబము, సంసారము అంటూ బంధాలు, అనురాగాలు పెంచుకుంటూనే ఉంటాడు, అకస్మాత్తుగా మరణం సంభవించేసరికి జీవాత్మ తట్టుకోలేకపోతుంది. శరీరంలో జీవం పోగానే దానిని భౌతికకాయం అంటారు. జీవాత్మ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించే ప్రయత్నాలు చేస్తుంది. నేను ఇక్కడే ఉన్నాను అని అరుస్తుంది. జీవాత్మకు తన భౌతికకాయం వద్ద రోదిస్తున్న వారందరూ కనిపిస్తుంటారు. వారి రోదనలు వినిపిస్తుంటాయి. కాని వాళ్ళకు జీవాత్మ కనిపించదు, జీవాత్మ గోడు వినిపించదు, అంతిమ ప్రయాణం మొదలవగానే జీవాత్మకు దుఃఖం ఆగదు. తనదేహం నాశనమయే సమయం సమీపిస్తుందని రోదిస్తూ భౌతికకాయంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. దహనం లేక ఖననం జరిగిన తరువాత జీవాత్మ ఇంటికే వచ్చేస్తుంది. పెద్దకర్మ అయిన వరకు ఇంటిలోనే ఉండి తను జీవించినంతకాలం ప్రేమించి పోషించినవారు తన

A Prayer for MARCH

  A Prayer for MARCH Lord, Keep me from the habit of thinking I must say something on every subject and on every occasion. Release me from craving to straighten out everybody's affairs. Keep my mind free from the recital of endless details. give me wings to get to the point. May I listen Sympathetically to the tales of other's pains. Help me to endure them with Patience. But seal my lips on my own aches and pains- They are increasing and my love of reharsing them is increasing too. Teach me the glorious lesson that occasionally it is possible that I may be mistaken. Give me the ability to see good things in unexpected places and talents in unexpected people. Make me thoughtful but not moody, helpful, but not bossy. And Lord,! May I have at least a few genuine friends?

కలికి కళ్ళెం వేయండి

కలికి కళ్ళెం వేయండి  ఇది కలియుగం..... ఆకలి యుగం..... కల్మషాలకు నిలయం. బాహ్యంలో వాతావరణ కాలుష్యం - ఆంతర్యంలో అధర్మ కాలుష్యం. బాహ్యంలో యంత్రాలు.... ఆంతర్యంలో కుతంత్రాలు. అంతా కాలుష్యాలే... కాపట్యాలే. భాగవతం ప్రవచించినట్లు కలిపురుషుడు విజృంభించాడు. కలికి కళ్ళెం వేయడమే మన ప్రధాన కర్తవ్యం. ధర్మం నశిస్తూవుంది. దయ అగోచరమైంది. న్యాయం నీరసించి పోయింది. మోసం అడుగడుగునా మకాం పెట్టింది. మంచితనం అడుగంటింది. సత్యం సడలిపోయింది. అహింస హడలిపోయింది. కులతత్వాలు పెచ్చుపెరిగాయి. అబద్ధాలు అందల మెక్కాయి. అరాచకాలు పాలిస్తున్నాయి. ఎక్కడ చూసినా....... హత్యలు, దోపిడీలు..... దగాలు, మారణహోమాలు... ఆకలికి అలమటించేవారు... శవాలతో క్రీడించేవారు.... ఎక్కడికి పోతూవుంది ఈ ప్రపంచం ? ఏమిటి దీనికి ఏకైక తరుణోపాయం ? మొన్నటి బొంబాయి ప్రేలుళ్ళతో చెవులు మూసుకు పోయాయి. నిన్నటి మరాట్వాడా భూకంపంతో కళ్ళు తిరుగుతున్నాయి. ఈ కలికి కళ్ళెం వేయాలి…ఈ కుళ్ళును కడిగి వేయాలి. ఏంచేయాలి ? ఎవరు చేయాలి ? ఒక్కటే చేయాలి.......మనమంతా కలిసి చేయాలి. నోరారా భగవన్నామం చేయాలి. కలియుగము ప్రబల దోషయుత మైనను దాని నివారణము కూడా కలియుగము నందే కలదని శుకమహర్షి

సుందర సత్సంగము

సుందర సత్సంగ్ కార్యక్రమము   1.ఓంకారము 2. ప్రార్థన 3. గణేశస్తుతి 4. గురుస్తోత్రం 5. భజన 6. భగవద్గీత -  ఒక అధ్యాయము పారాయణ 7. విష్ణుసహస్రనామములోని కొన్ని నామాలపై వ్యాఖ్యను చదువుట 8. చంద్రభాగా తరంగాలు - ఒక కథను చదువుట 9. కలికల్మష నాశన మహామంత్రం... హరేరామ... హరేరామ 10. భజన 11. అష్టకము 12. అంతరేక్షణ 1. గత వారములో నిత్యము ధ్యానము చేయుట జరిగినదా? 2. ఏ ఆధ్యాత్మిక గ్రంథమును చదివితివి? 3. ఎన్ని గీతాశ్లోకాలు కంఠస్థము చేసితివి? 4. ఎన్ని గంటలు మౌనము పాటించితివి ? 5. ఎంత దానము చేసితివి ? 6. ఎన్ని పర్యాయములు కోపము వచ్చినది ? ఎందులకు? కోపము వచ్చినందుకు నీవు అనుసరించిన స్వయం ప్రాయశ్చిత్తమేమి ? 7. ఎంతమందిని విమర్శించితివి ? దానివలన ఏమి లభించినది.  8. ఈ వారములో  ఏ సద్గుణము నలవరచు కొంటివి ? 9. ఏ దుర్గుణమును పోగొట్టుకొంటివి ? 10.  ఏ ఇంద్రియము నిన్ను ఎక్కువగా బాధించుచున్నది ? దానిని జయించుటకు నీవు అనుసరించు సాధనమేమి? 13. ధ్యానము 14. హారతి... ఓం జయగీతామాతా  15. ఓం నమో భగవతే వాసుదేవాయ 16. శ్రీ రామ జైరామ జై జై రామ ఓం.  17. మృత్యుంజయ మహామంత్రము. శాంతిమంత్రము సుందర సత్సంగము ప్రతిజ్ఞ సుందర సత్సంగ సభ్యుల

కాంగ్రెస్ కళేబరాన్ని ఈడ్చిపారేద్దాం

కాంగ్రెస్ కళేబరాన్ని ఈడ్చిపారేద్దాం ------భారతీయరాష్ట్రసమితికి బాసటగా నిలుద్దాం. ---------------జై బాపూ కెసిఆర్ తెలంగాణను నెత్తుటిముద్దగా మార్చిన కాంగ్రెస్ పార్టీ పీడ వదిలి తొమ్మిదన్నరేళ్ళు అయింది. గాయాలను మాన్పుకుంటూ,శక్తిని కూడదీసుకుంటూ తెలంగాణతల్లి ఊపిరి తీసుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ భూతం గ్యారంటీలపేరుతో మళ్ళీ మనముందుకొస్తుంది. తెలంగాణ తల్లి గొంతునులుమడానికి తహతహలాడుతుంది....... కంట్లో వత్తులేసుకొని తెలంగాణ తల్లికి కాపలాకాస్తున్న బాపు కేసిఆర్ ను అడ్డు తొలగించుకోవడానికి అడ్డమైనపనులకు పూనుకుంటుంది. తెలంగాణ చరిత్రను ఒకసారి సింహావలోకనం చేసుకుంటే కాంగ్రెస్ దుర్మార్గం కళ్ళముందు మెదులుతుంది. ఆ దృశ్యాలు మనలను ఒక పట్టానవదిలిపెట్టవు,నీడలా వెంటాడి భయపెడతాయి. ఆపరేషన్ పోలోనుండి ప్రారంభమైన కాంగ్రెస్ రక్తచరిత్ర బాపు కేసిఆర్ వచ్చేదాకా అప్రతిహతంగా కొనసాగింది. నిజాం విముక్తి పేరుమీద తెలంగాణ ప్రజలపై దమనకాండ కొనసాగించింది............ నిజాంకు,నిజాంనవాబు అండతో గ్రామాల్లో దొరలు,దేశ్ ముఖ్ లు సాగిస్తున్న దోపిడి,పీడనలకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన పోరాటాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. ప్రజలు పోరాడి

నమస్తే తెలంగాణ ఆచరించి, ఆదర్శంగా నిలిచి.. సిరికొండ మధుసూదనాచారి

నమస్తే తెలంగాణ 01 october 2023 ఆచరించి, ఆదర్శంగా నిలిచి.. సిరికొండ మధుసూదనాచారి (ఎమ్మెల్సీ, తెలంగాణ అసెంబ్లీ తొలి స్పీకర్, బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు) ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలు, కార్యక్రమాలను రూపొందించడంలో కేసీఆర్ సర్కార్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. కుల వృత్తిదారులు, బడుగు వర్గాల స్వయం ఉపాధికి బీసీ బంధు, దళిత బంధు లాంటి పథకాలను అమలు చేస్తున్నది. పర్యావరణం, గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారించి మెరుగైన ఫలితాలను సాధించింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ వ్యవస్థకు సాంకేతిక హంగులుఅద్దింది. హైదరాబాదు అంతర్జాతీయ కంపెనీలకు కేంద్రంగా తీర్చిదిద్ది ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ఉపాధి అవకాశాలను పెంచింది. బీ సీ బంధు పథకం ద్వారా అర్హులైన వారికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. కుల వృత్తిదారుల జీవనోపాధికి గొర్రెలు, చేపలు ఉచితంగా పంపిణీ చేస్తున్నది. తరతరాలుగా సంపద సృష్టిలో ముందుండి అసమానతలు, అవమానాలు ఎదుర్కొన్న దళిత జాతిని పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారులుగా తీర్చిదిద్దడానికి దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నది. పరిపాలన సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డ

నీటి పారుదల రంగ ఆణిముత్యం

నమస్తే తెలంగాణ 01 అక్టోబర్ 2023 నీటి పారుదల రంగ ఆణిముత్యం ఇంజినీర్ కె.పెంటారెడ్డి Artical Writer: కె. వెంకట రమణ 9849905900 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతే మన రాష్ట్రానికి చెందిన వివిధ రంగాల్లో నిష్ణాతులు, ప్రముఖుల గురించి తెలుసుకోవడం, బాహ్య ప్రపంచానికి వెల్లడవడం ప్రారంభమైంది. అలాంటి తెలంగాణ మట్టి బిడ్డల్లో ఒకరు, ఎత్తిపోతల రంగ నిష్ణాతులు, ఇంజినీర్ కె.పెంటారెడ్డి. ఈఎన్సీగా రిటైర్డ్ అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ప్రతిభను, కార్యదక్షతను గుర్తించారు. అందుకే ఎత్తిపోతల రంగ సలహాదారుగా నియమించారు. విద్యుత్ శాఖలో పెంటారెడ్డి సూపరింటెండెంట్ ఇంజినీరుగా పదవీ విరమణ చేశారు. పదవిలో ఉన్నప్పుడే ఉమ్మడి రాష్ట్రంలో ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకంలో పుట్టంగండి పంప్ హౌజ్ నిర్మాణం, పంపులను అమర్చడం తదితర పనులను విద్యుత్తు శాఖ తరపున పర్యవేక్షించారు. 18 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 5 పంపులను ఈ పంప్ హౌజ్లో అమర్చారు. వీటిని తయారుచేసింది బీహెచ్ఈఎల్. 100 మీటర్ల సింగిల్ లిఫ్ట్ ద్వారా నీటిని ఎత్తిపోసే ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో తెలంగాణలో భారీ ఎత్తిపోతలకు డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రం చేపట్టిన