15 slokam
చైతన్య భగవద్గీత భక్తి యోగం 15 వ శ్లోకం యస్మా న్నోద్విజతే లోకో లోకా న్నోద్విజతే చ యః I హర్షమర్ష భయోద్వేగై ర్ముక్తో యః స చ మే ప్రియః II 15 II యస్మాత్-న-ఉద్విజతే-లోకః-లోకాత్-న-ఉద్విజతే-చ-యః హర్షమర్షభయోద్వేగైః-ముక్తః-యః-సః-చ-మే-ప్రియః అర్జునా! భక్తుని వల్ల లోకానికి బాధ ఉండదు. లోకం వల్ల భక్తునికి బాధ లేదు. అతడు భక్తుడంటే! ఆనంద ఆక్రోశాలు, భయావేశాలు అతనిని చేరలేవు. అట్టి భక్తుడే నాకు ప్రియుడు. వ్యాఖ్య బాధ అనేది భరించ దగింది కాదు. హింస అనేది సహించ దగిందీ కాదు. అలాంటి వాటిని భరించాలన్నా,భరించే పరిస్థితిని ఊహించాలన్నా, మనిషి ఉద్వేగానికి లోనవుతాడు. ఇవన్నీ భయాలు. భయాలు ఎవరికీ ఆరోగ్యప్రదం కావు. వాటికి ఎవరూ గురి కాకూడదు. అలాంటి భయరహిత సమాజాన్ని మానవలోక మంతా ఆశిస్తోంది. కానీ, లోకం అభయ స్థానంగా మారాలి అంటే, లోకం గీతా భక్తులతో నిండి పోవాలి. గీతను అర్థం చేసుకున్న వారు జీవించే లోకమే అభయ ప్రదేశంగా మారుతుంది. గీతాజ్ఞానమే లోకానికి అభయ ప్రదానం చేయ గలుగుతుంది. ప్రస్తుత శ్లోకం ఈ సత్యాన్ని స్పష్టం చేస్తుంది. భగవద్గీతలో నాకు అత్యంత ప్రియమైన శ్లోకాలలో ఇదొకటి. పెట్టేది లేదు - పడేది లేదు భక్త...