Posts

Showing posts from October, 2024

దైవ నిర్మితమైన ఈ సృష్టిలోని ప్రతి అంశాన్నీ ప్రేమించడం మన మొదటి లక్ష్యం, చివరి లక్ష్యం.

  దైవ నిర్మితమైన ఈ సృష్టిలోని ప్రతి అంశాన్నీ ప్రేమించడం   మన మొదటి లక్ష్యం , చివరి లక్ష్యం. * గమ్యం - గమనం **జీవిత లక్ష్యం ఏమిటి ? ఏ లక్ష్యమూ చేరుకోవాలనే కోరిక లేని స్థితిని చేరుకోవడమే జీవిత లక్ష్యం. ఏ గమ్యమూ అవసరం లేని సంపూర్ణ సంతృప్తి , పరిపూర్ణ సుఖ ప్రవృత్తి - ఇదే లక్ష్యం. ఈ మాటలు సరిగ్గా అర్థం అయితే ' జీవించి ' ఉండడమే జీవన లక్ష్యమని తెలుసుకుంటారు. ' ఉల్లాసకరంగా ', ' ఉత్తేజభరితంగా ' జీవిస్తూ జీవన ఫలం లోని మాధుర్య రసాన్ని జుర్రుకోవడమే నీ లక్ష్యం. నీ గమ్యమేమిటని నదిని అడుగు. సముద్రంలో చేరడమంటుంది. సముద్రాన్ని అడుగు , జవాబు దొరకదు. చిన్న నదికి గమ్యం ఉంది. పెద్ద కడలికి పెద్ద గమ్యం ఉండాలి కదా! అసలేమి లేదు. * * నీవు శారీరకంగా , మానసికంగా ఆరోగ్యంగా జీవిస్తుంటే అది చాలు. నీ జీవిత లక్ష్యం నెరవేరి పోయింది. అసలైన లక్ష్యాలన్నీ ఎప్పుడో ముందుగానే సాధింపబడినాయి. ఇప్పుడు నువ్వు సాధించ దలచుకున్నవి ఎంత చిన్నవైనా , ఎంత పెద్దవైనా సరే , కేవలం ఆభరణాలు మాత్రమె. అలంకార ప్రాయమే. ఇక్కడ రెండు విభిన్న విషయాలున్నాయి. ఒకటి లబ్ది దారుడు. రెండు లభ్య వస్తువు. మంచి ఉద్యోగం , పెద్ద జీత...

కేసీఆర్ అనే పేరు నీ శ్వాసలో ఉంది

కేసీఆర్ అనే పేరు నీ శ్వాసలో ఉంది నీ హృదయంలో ఉంది నీ ప్రతి ఊపిరిలో కేసీఆర్ నీ ప్రతి మాటలో కేసీఆర్ నీ కలలలో కూడా కేసీఆర్ ప్రతి రోజు నిన్ను నిద్ర పోనివ్వకుండా నీకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తుందే కేసీఆర్ అధికారం ఉన్నా నీకు మనశ్శాంతి లేకుండా చేసే పేరే కేసీఆర్ కేసీఆర్ పేరును నువ్వే మరిచిపోలేక పోతున్నావ్ ఇంక ప్రజల హృదయాల నుండి చేరిపేయడం నీ వల్ల కాని పని సోదరా గోడలపై వేసిన రంగులు చెరిపినంత సులభం కాదు సోదరా కేసీఆర్ అనే పేరును చెరిపేయడం పాలన అందించడం చేతగాక రోజు రోజు అహంకారంతో పెట్రేగి పోతున్న నీకో చిన్న సలహా అహంకారం అగ్ని వలె అందరినీ దహించు తనను తాను మరిచి తన పతనాన్ని పిలుచు. గర్వం గర్వించు గర్వించు అహంకారం అహంకరించు పతనం పతనమవ్వు ఒంటరిగా ఒంటరిగా అహంకారం అంధకారంలో తనను తాను కోల్పోయి పతనానికి పిలిచే అహంకారం పాతాళానికి ఇప్పటికైనా అహాన్ని వీడి నమ్మి ఓట్లేసిన ప్రజలకు మంచి చేయండి మీరు తుడిచేయడానికి ఆనవాలు లేకుండా చేయడానికి కేసీఆర్ కేవలం ఒక పేరు కాదు తెలంగాణ రాష్ట్ర స్వప్నం తెలంగాణ ప్రజల అస్థిత్వం తెలంగాణ ప్రజల గుండె చప్పుడు జై తెలంగాణ....జై కేసీఆర్

కేసీఆర్ అనే మూడక్షరాలు

కేసీఆర్ అనే మూడక్షరాలు ఈ భూమి ఉన్నన్ని రోజులు ఉంటుంది ఎవరు చెరపలేరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మనల్నీ శిఖరం వైపు నిలబెట్టాడు అతని పుణ్యమే నీకు వచ్చిన పదవి కొన్ని మాట్లాడే ముందు నోరు అదుపులో ఉంచుకోవాలి అధికారం ఉంది కదా అని తక్కువ చేస్తూ మాట్లాడితే కాలం సమాధానం చెప్తుంది పదవులు ఎవరికి శాశ్వతం కాదు జీవించిన తీరు అనేదే శాశ్వతం కొన్ని సందర్భాలు కొన్ని మాటలు అర్దం కావాలంటే మనిషి తాలూకు లక్షణాలు ఉండాలి అవి నీకు లేవని నీ మాటల్లో అర్దం అవుతుంది నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు మూల్యం చెల్లిస్తావు