Posts

Showing posts from February, 2026

ఆలయ ప్రాంగణంలో అమానవీయం

పసికూనలు. దేవుళ్లతో సమానం. కాలెత్తి ఎలా తన్నబుద్దయింది. ఆడబిడ్డంటే అమ్మగదా! అమ్మనెట్లా చంపబుద్ధవుతుంది దేవుడు అందరికీ సమానమే కదా వెలివేతలెందుకు మల్లన్న దేవుడు ఓ కులం జాగీరా? కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రజలకు శాంతిభద్రతలు ఎండమావులు అయ్యాయి. ముఖ్యంగా బీసీలు, ఎస్సీలపై దాడులు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయి. తెలంగాణ సభ్యసమాజం తలదించుకునేటట్టుగా ప్రజలకు రక్షణగా ఉండాల్సిన కొంతమంది పోలీసులు నేరస్తులకు అండగ ఉండటం విచారకరం. అధికార పార్టీ నాయకుల మెప్పుకోసం నిబంధనలను నిదితులను గాలికి వదిలేసిన ఘటన కుమ్మెర దేవాలయ జాతరలో జరిగింది. 'నా భర్తను కొట్టకండయ్యా..పచ్చిబాలింతను... రెండు నెలల పసికందు నా బిడ్డ ముఖమన్నా చూడండి.. మీ కాల్మొక్కుత' అని కాళ్లమీద పడి చిలికేశ్వరం గణేశ్ భార్య మౌనిక వేడుకున్నా కనికరించని కుల దురహంకారులు కాళ్లతో తన్నడంతో పసిబిడ్డ మృతి చెందింది. ఈ అనాగరిక ఘటనతో రాష్ట్రమంతా అట్టుడుకి పోతున్నా కనీసం స్పందించని కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ దుర్మార్గానికి నిదర్శనంగా నిలుస్తున్నది. జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమ్మెర గ్రామంలో ఏటా శివరాత్రి సమయంలో (మల్లికార్జునుడు) మల్లన్న దేవుడ...